కాబోయే ప్రధాని ఎవరో చెబితే...30 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్!

కాబోయే ప్రధాని ఎవరో చెబితే...30 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్!

ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్కరూ ఎన్నికల గురించే చర్చిస్తున్నారు. రాబోయే ఫలితల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలవనుంది. ఎవరు చక్రం తిప్పబోతున్నారు. లాంటి చర్చలతో అటు సాధారణ ప్రజలూ, ఇటు సోషల్ మీడియాలోని నెటిజన్‌లు తమతమ సొంత ఎగ్జిట్‌పోల్స్‌ని సన్నిహితులతో చెప్తున్నారు. ప్రజల్లో ఉండే ఈ ఆసక్తినే జొమాటో చక్కగా వినియోగించుకుంటోంది. ఇంకో రెండ్రోజుల్లో ఫలితాల తర్వాత కాబోయే ప్రధాని ఎవరు? అనే కాంటెస్ట్ పెట్టింది. కాబోయే ప్రధాని ఎవరో ముందే అంచనా వేసి చెప్పగలిగితే ఖచ్చితంగా చెప్పిన వారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది జొమాటో. ఇటీవల ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ప్రీమియర్ లీగ్ నిర్వహించిన జొమాటో ఇప్పుడు ఎలక్షన్ లీగ్ పేరుతో కస్టమర్లకు ఈ ఆఫర్‌ను ఇస్తోంది.

జొమాటో ప్రకటించిన ఎలక్షన్ లీగ్ మే 22 వరకు కొనసాగుతుంది. జొమాటోలో మీరు చేసే ప్రతీ ఆర్డర్‌లో కాబోయే ప్రధాని ఎవరో మీరు గెస్ చేయవచ్చు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీతో పాటు ఇతరుల పేర్లను గెస్ చేయవచ్చు. సరిగ్గా గెస్ చేసినవారికి 30 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తామని జొమాటో చెబుతోంది. ఫలితాల తర్వాత క్యాష్‌బ్యాక్ మీ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. ఇలా ప్రెడిక్షన్‌తో కస్టమర్లకు ఆఫర్లు ఇవ్వడం ఇదే కొత్త కాదు. ఐపీఎల్ సీజన్‌ సమయంలో ఇలాంటి ఆఫర్ అందించింది. మే 2 నాటికి 1.4 కోట్ల ప్రెడిక్షన్స్ వచ్చాయని అంచనా. వీటి ద్వారా కస్టమర్లకు రూ.15 కోట్ల వరకు క్యాష్‌బ్యాక్ దక్కిందని లెక్క తేలింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *