నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న వైఎస్ జగన్

నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న వైఎస్ జగన్

ఢిల్లీ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పర్యటనను రద్దు చేసుకుని ఏపీకి పయనమైయ్యారు. ఏపీ భవన్ నుండి ఉదయం 9 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వెళ్లనున్న జగన్… మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి చేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఇవాళ రాత్రి పులివెందులకు వెళ్తారు. రేపు ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ దగ్గర జగన్‌ నివాళి అర్పిస్తారు. తర్వాత గండిక్షేత్రంలోని ఆంజనేయస్వామి గుడిలో జగన్‌ పూజలు నిర్వహిస్తారు. అనంతరం పులివెందుల సీఎస్‌ఐ చర్చి, కడప దర్గాలోనూ మంగళవారం జగన్‌ ప్రార్థనలు చేస్తారు.

ఆదివారం ఢిల్లీకి వెళ్లిన జగన్.. ప్రధాని మోదీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *