బాబాయ్ వివేకా హత్యపై జగన్ సంచలన వాక్యాలు

బాబాయ్ వివేకా హత్యపై జగన్ సంచలన వాక్యాలు

తన చిన్నాన్న వివేకనందాను ఎలా హత్య చేశారో జగన్‌ వివరించారు. డ్రైవర్‌పై నెట్టేందుకు.. పోలీసులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ లెటర్ పోలీసులు తనకు చూపించారని.. ఆయన చెప్పుకొచ్చారు. హత్యకు గురయ్యేవాళ్లు లెటర్ ఎలా రాస్తారని జగన్ ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తు తీరు చూస్తూంటే బాధేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని.. సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే.. తమ ఇంట్లో హత్యలు జరుగుతున్నాయని.. జగన్ ఆరోపించారు. వైఎస్ ను దెబ్బతీయడానికి రాజారెడ్డిని హత్య చేశారని..తర్వాత తన తండ్రిని చంపేశారన్నారు. తన తండ్రి హత్యపై ఇప్పటికీ అనుమానాలున్నాయన్నారు. తనపై కూడా హత్యాయత్నం జరిగిందని.. ఎయిర్ పోర్టులో కత్తులతో దాడి చేశారన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *