ప్రజల నమ్మకాన్ని కాపాడతాను...స్పందించిన జగన్!

ప్రజల నమ్మకాన్ని కాపాడతాను...స్పందించిన జగన్!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం దాదాపు ఖాయం కావడంతో…రాష్ట్ర ప్రజాలను ఉద్దేశించి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన విజయంపై సోషల్ మీడియాలో స్పందించారు. రాష్ట్ర ప్రజలు నామీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్‌ రాష్ట్ర ప్రజలకు… హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు నామీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’ అని ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.

వైసీపీకి పూర్తి మెజారీటి రావడంతో ఆపార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. దీనికోసం వైఎస్ఆర్ పార్టీ శాసనసభా పక్షం శనివారం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా జగన్‌ను ఎన్నుకోనున్నారు. సాధరణంగా శాసనసభ పక్ష నాయకుడే సభా నాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడతారు. మరోవైపు జగన్‌కు పలువురు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతికి జగన్‌ ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *