ఖాయమైన జగన్ విజయం

ఖాయమైన జగన్ విజయం

ఊహించని స్థాయిలో వైసీపీ అత్యధిక సీట్ల అధిక్యంతో దూసుకుపోతోంది. అందరి అంచనాలను దాటుతూ దాదాపు 145 స్థానాల్లో అధిక్యంతో కొంచెం అటుఇటుగా అన్నే సీట్లను గెలిచే దిశగా వైసీపీ వెళ్తోంది. ఓటమి దాదాపు ఖాయమవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈరోజు సాయంత్రం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే వైసీపీ గెలుపు ఖాయం కావడంతో రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎన్నికైన ఎమ్మెల్యేల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇడుపులపాయ‌లో శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశారు.25న జ‌రిగే స‌మావేశంలో జ‌గ‌న్‌ను త‌మ నేత‌గా ఎన్నుకోనున్నారు. ఈనెల 30న ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

త‌న తండ్రి మ‌ర‌ణంతో రాజ‌కీయంగా విప‌త్కర ప‌రిస్థితులను ఎదుర్కొన్న జ‌గ‌న్ త‌న చిర‌కాల వాంఛ అయిన ఏపీ ముఖ్య‌మంత్రిగా ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. తొలుత ఈనెల 26నే ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారు చేశారు. అయితే విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స్వామీజీ సూచ‌న‌ల మేర‌కు జ‌గ‌న్ ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని సూచించారు. దీనికి అనుగుణంగా జ‌గ‌న్ విజ‌య‌వాడ‌- గుంటూరు జాతీయ ర‌హ‌దారి పైన ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ ఎదురుగా ఉన్న ఓపెన్ స్థ‌లంలో ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని నిర్ణ‌యించారు. జ‌గ‌న్‌తో పాటుగా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *