కాళేశ్వరం కట్టినప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా? : సీఎం జగన్

కాళేశ్వరం కట్టినప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా? : సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే మాటల యుద్ధానికి దారితీసింది. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి డ్యాం పెంచారన్న సీఎం వైఎస్ జగన్… ఏపీకి రావాల్సిన కృష్ణా జలాలు బాగా తగ్గిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించేటప్పుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని జగన్ ప్రశ్నించడాన్ని… టీడీపీ తీవ్రంగా తప్పుపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఏపీ పట్ల సానుకూలంగా ఉండటం వల్లే… ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే మంచిదే అన్నారు. ఐతే… గాడిద అని జగన్ అనడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. తాను సామెత చెప్పానన్న జగన్… అలా చెప్పడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *