మరికాసేపట్లో ఢిల్లీకి వైయస్‌ జగన్‌

మరికాసేపట్లో ఢిల్లీకి వైయస్‌ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ మరికాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసంలో భేటీ అవుతారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌… ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించినందుకు మోడీకి శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోడీకి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. ఆయనతోపాటు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. జగన్‌తో పాటు.. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సహా పలువురు నేతలు జగన్‌ వెంట వెళ్లనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *