'మంత్రి' పదవుల రేసులో నేతలు వీరే!!

'మంత్రి' పదవుల రేసులో నేతలు వీరే!!

జగన్‌ సునామీ సృష్టించారు. ఈ నెల30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్‌ బెర్త్‌ల కోసం భారీగా పోటీ పెరిగింది. అయితే జగన్‌ కేబిబెట్‌లో మంత్రులెవరు? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? ఎంతమందికి కేబినెట్‌లో అవకాశం దక్కవచ్చు?

అఖండ విజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఏయే ప్రాంతాలకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. 151 స్థానాల్లో వైసీపీ గెలుపొందడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలువురు సీనియర్లు, జూనియర్లు మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది.

కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చి 2011లో వైసీపీ ఏర్పాటు చేసినప్పుడు జగన్‌ని సీమాంధ్రకి చెందిన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అనుసరించారు. వీరిలో నలుగురికి మంత్రి పదవులిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. కచ్చితంగా ఏ నలుగురు అన్న దానిపై స్పష్టత లేదు. అన్ని సామాజికవర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంది. జగన్‌ రాయలసీమలోని పులివెందుల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నందున కోస్తా, ఉత్తరాంధ్రల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఒకరిద్దరిని తీసుకునే అవకాశం లేకపోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఎన్నికల ప్రచార సభల్లోనే జగన్‌ ప్రకటించారు. చిలకలూరిపేట టిక్కెట్‌ని త్యాగం చేసినందుకు పార్టీ నేత మర్రి రాజశేఖర్‌ని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని పేర్కొన్నారు. నెల్లూరు నగరం నియోజకవర్గం నుంచి హోరాహోరీ పోరులో గెలుపొందిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేరు సైతం పరిశీలనలో ఉన్నా… అతన్ని మరో ముఖ్య పదవికి ఎంచుకోవచ్చన్న ప్రచారం ఉంది.

మంత్రివర్గం రేసులో ఉన్నవారి వివరాలు ఓసారి చూద్దాం.
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి
విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీవాణి
విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమరనాధ్, గొర్ల బాబూరావు
తూర్పుగోదావరి జిల్లా నుంచి సుభాష్‌ చంద్రబోస్‌, కన్నబాబు
పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆళ్ల నాని, తానేటి వనిత, గ్రంథి శ్రీనివాస్‌
కృష్ణా జిల్లా నుంచి పేర్ని నాని, ఉదయభాను, పార్థసారథి, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు
గుంటూరు జిల్లా నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్‌, అంబటి రాంబాబు
ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌
నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి
చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా
కడప జిల్లా నుంచి శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌ బాషా.
కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, శ్రీదేవి
అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి

అయితే – సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జగన్‌ ఎవరెవరికి పదవులు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మే 30 తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *