జగన్ అనే నేను..

జగన్ అనే నేను..

ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా…బుల్లెట్ దిగిందా..లేదా అనే డైలాగ్ ను అక్షరాలా నిజం చేశారు వైఎస్ జగన్. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీఅని చెప్పుకునే బాబును కేవలం ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో మట్టికరిపించడం మామూలు విషయం కాదు…ఇంతకీ జగన్ చేసిన మ్యాజిక్ ఏంటి…? జగన్ కు ఏయే అంశాలు కలిసొచ్చాయి..ఇవన్నీ తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ…

కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా పట్టుదలగా వ్యవహరిస్తే విజయం సాధించడం పెద్ద లెక్కకాదనే సామెతను అక్షరాలా నిజం చేశారు వైఎస్ జగన్.. సరిగ్గా ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలో రానప్పుడు ఈ పార్టీ ఉంటుందా..ఊడుతుందా..అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఐదేళ్లు సరిగ్గా కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారు జగన్.

పార్టీ వ్యూహకర్త గా ప్రశాంత్ కిషోర్ ను ఎంచుకోవడం జగన్ కు కలిసొచ్చింది. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించడం, జగన్ కు సలహాలివ్వడం లాంటివి ప్రశాంత్ కిషోర్ తూచాతప్పకుండా చేసి వైసీపీ విజయానికి బాటలు వేశారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ ఎలా ఉంది..? ఏయే స్థానాల్లో ఏ అభ్యర్థులను నిలబెట్టాలి లాంటి అంశాలు ప్రశాంత్ కిషోర్ టీం పక్కాగా చేసింది. ఆ తర్వాత జగన్ గెలుపులో చెప్పుకోదగ్గ పాత్ర పోషించింది విజయసాయిరెడ్డి. కేంద్రంలో బీజేపీ తో టీడీపీ బంధానికి బీటలు వేయడం దగ్గరనుంచి …సరిగ్గా వ్యూహాలు అమలు చేయడం వరకు విజయసాయి కీలక పాత్ర పోషించారు. ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం మొదలు సొంతపార్టీ నేతలను కాపాడుకోవడం వరకు విజయసాయి చేయని పనిలేదు.

ఆ తర్వాత జగన్ విజయంలో చెప్పుకోదగ్గ వ్యక్తి సజ్జల రామకృష్ణా రెడ్డి. పార్టీ నేతల అభిప్రాయాలు జగన్ కు చెప్పడం,నాయకుల ఇబ్బందులు గుర్తించి సలహాలు ఇవ్వడం లాంటి పనులు సజ్జల చేసి విజయానికి పునాదులు వేశారు. జగన్ కార్యక్రమాలు ఏంటి..వాటికి ఎంతెంత నిధులు సమకూర్చాలి…లాంటి అంశాలన్నీ సజ్జలే చూసుకున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా తన అనుభవంతో వచ్చిన సలహాలు జగన్ కు చెప్పి విజయానికి బాటలు వేశారు.

ఏదేమైనా ప్రపంచంలో నాలుగు దిక్కులు ఉన్నట్లు జగన్ విజయంలో కూడా ప్రశాంత్ కిషోర్, విజయసాయి, సజ్జల, ఉమ్మారెడ్డిలు నాలుగు దిక్కులుగా ఉండి విజయానికి బాటలు వేశారు. అంతకు మించి జగన్ పట్టుదల కూడా సీఎం పీఠానికి దగ్గర చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *