గంజాయి మ‌త్తులో తేలుతున్న యువ‌త‌

గంజాయి మ‌త్తులో తేలుతున్న యువ‌త‌

 ఏ దేశాభివృద్ధి అయినా సరే కుంటుపడిపోవడం, ఒక్కసారిగా వినాశనమవడం లాంటి పెను విపత్తులకు పెద్ద పెద్ద యుద్ధాలు, ఆణ్వాయుధాలే కారణమవ్వాలనేంలేదు. ఆ దేశంలోని తరగతి గదుల్లో అమలవుతున్న విద్యలో విలువలు లేకపోతే చాలు.. యావజ్జాతి తుడిచిపెట్టుకుపో తుంది. అంధకారంలో మగ్గిపోతుంది. డ్రగ్స్‌ వల్ల ఇప్పటికే పంజాబ్‌ రాష్ట్రం ఎంతో నష్టపోయింది.రామగుండం కమీషనరేట్‌ పరిధిలో గంజాయిని అమ్ముతున్న‌12 మందిని అరెస్ట్ చేసి 15 కేజీల గంజాయిని  పోలీసులు చేసుకోవడం,పట్టుబడ్డ విద్యార్థులు చెప్పిన స‌మాధానాలు విని పోలీసులే షాక్‌య్యారు….. మ‌త్తులో ఉన్నప్పుడు అసాంఘీక కార్యక‌లాపాల‌తో పాటు విచ‌క్షణ కోల్పోయి ఎం చేస్తున్నామో తెలియ‌ని ప‌రిస్థితి యువ‌త‌ది…మ‌త్తులో దొంగ‌త‌నాలు, గొడ‌వ‌లు, హ‌త్యలు, అత్యాచారాలు, పాల్పడుతూ బంగారు భ‌విత‌ను నాశ‌నం చేసుకుంటున్నారు.

drug addiction

కోడ్ భాష…

గంజాయి కోసం యువ‌త వాట్సాప్ టెక్నాల‌జిని బాగు ఉప‌యోగిస్తోంది… వాట్సాప్ గ్రూపుల ద్వార మ‌త్తు ప‌దార్థాలు ల‌భించే ప్రదేశాలను గ్రూపుల్లో షేరింగ్ చేసుకోవ‌డం, కోడ్ భాష ద్వార ఇంట్లో వాళ్ళు మెసేజ్ లు చ‌దివినా తామేం చేస్తున్నామో కుటుంబ స‌భ్యుల‌కు అర్థం కాని విధంగా ఒక‌రి ద్వార మ‌రొక‌రు మ‌త్తు ప‌దార్థాల‌ను పొందుతున్నారు.. పాడుబ‌డ్డ బిల్డింగ్ లు, సింగ‌రేణి క్వార్టర్స్, వాట‌ర్ ట్యాంక్లు, రైల్వే ట్రాక్ ల ప‌క్కన , చెట్లపొద‌లు, నిర్జన ప్రదేశాల్లో మ‌త్తు ప‌దార్థాల్ని సేవిస్తున్నారు.. 

సినిమాల ప్రభావం… 

ప్రస్తుత పరిస్థితిలో యువతపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు… గంజాయి కి అలవాటుపడిన యువకులతో పోలీసులు విచార‌ణ‌లో  మాట్లాడినప్పుడు వారు చెప్పే విషయాలు విని ఒకింత ఆశ్చర్యానికి లోన‌య్యారు…ఇటీవల వచ్చిన సినిమాలలో హీరోల ప్రవర్తన ,వారి అలవాట్లు ,వేషదారణ ప్రభావంతో యువత త‌మ‌ను తాము హీరోల్లాగా భావించి సినిమాల్లో కొన్ని సంద‌ర్భాల్లో హీరోలు ప్రవ‌ర్తించిన‌ట్లుగా గంజాయి సేవించ‌డం జ‌రుగుతోంది.. గంజాయి , డ్రగ్స్ ఉత్పత్తి మంచిర్యాల, పెద్దప‌ల్లి  జిల్లాలో లేన‌ప్పటికి మత్తు ప‌దార్థాల‌కు ఎక్కువ‌మంది యువ‌త బానిస‌లుగా మార‌డం పోలీసుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

weed

ఎర్రబడుతాయి…

 మరోవైపు జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటుపడి  అక్రమంగా డబ్బులు సులభంగా సంపాధించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో కొంతమంది వ్యక్తులు  గంజాయిని  అక్రమంగా ఇతర ప్రాంతల నుండి తక్కువ ధరకు తీసుకువచ్చి ,అమాయకమైన విద్యార్థులను,కూలీ పనులు చేసుకోనేవారిని లక్ష్యంగా చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్ లను తయారీ చేసి అమ్మడం ద్వార డబ్బు సొమ్ము చేసుకుంటున్నారు . గంజాయి సేవిస్తే కళ్ళు ఎర్రబడుతాయి కాబట్టి కుటుంబ సభ్యులు గుర్తించకుండా మెడికల్ షాప్ లో దొరికే “EYE COOL DROPS  వాడుతున్నారు.

weed

కలసికట్టుగా…

మనకున్న ఆస్తిపాస్తులు ఇళ్లు, పొలాలు కాదు.. మన పిల్లల సచ్ఛీలత, వారు నేర్చుకున్న నైతిక విలువలు, జీవితంలో వారు పాటిస్తున్న క్రమశిక్షణ.. ఇవే మన నిజమైన ఆస్తులు. ఈ సంపాదన కోసం అంతా కృషి చేయాలి. తల్లి దండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సమాజం.. ఇలా అంతా కలసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విశేష ప్రచారం కల్పించాలి. అప్పుడు మన భవిష్యత్తు తరాలను, మన దేశాన్ని మనం కాపాడుకున్నవారమవుతాం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *