ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా

ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా

ఇద్దరు యువకులు ఆటవిడుపు కై సరదాగా నగరశివారులోని దూలపల్లి దుమార్ చెరువులో టిక్ టాక్ యాప్ ను అనుకరిస్తూ నర్సింహా అనే యువకుడు చెరువులో దిగి ఈత రాక మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిది లో జరిగింది..ఈ సంఘటన ఆలశ్యం గా వెలుగులోకి వచ్చింది.

ఈత సరదా ఓ యువకుని ప్రాణం బలిగొంది.. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల దూలపల్లి గ్రామంలో ని తుమార్ చెరువు లో మంగళవారం నరసింహులు , ప్రశాంత్ ఇద్దరు వరసకు అన్నదమ్ములు వీరు సంగారెడ్డి వాస్తవ్యులు సంగారెడ్డి ప్రాంతం నుండి సూరారంలోని ఉంఢే అన్న అయిన ప్రశాంత్ దగ్గరకు వచ్చాడు… సరదాగా దూలపల్లి లోని చెరువు దగ్గరకు ఇద్దరు వెళ్లి ఫోన్ లో టిక్ టాక్ ను అనుకరిస్తూ నర్సింహా చెరువులో దిగాడు.. చెరువు గట్టుపై నుండి ప్రశాంత్ వీడియో చిత్రీకరస్తుండగా నర్సింహ ఈత రాక గల్లంతయ్యాడు.. దీంతో భయపడిన ప్రశాంత్ స్థానికులకు సమాచారం ఇచ్చాడు.. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి కావడంతో మరుసటి రోజు గాలించి మృతదేహం ను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *