ఎన్నికల వేళ బయటకొస్తున్న నోట్ల కట్టలు...

ఎన్నికల వేళ బయటకొస్తున్న నోట్ల కట్టలు...

ఎన్నికల ప్రచారం వేళ డబ్బులు వెదజల్లుతూ కొందరు వైసీపీ నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన తరఫున శిరివెళ్లలో ప్రచారం చేస్తున్న కొందరు నేతలు ప్రజలపై డబ్బులు వెదజల్లారు. దీంతో నోట్లు ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు.ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీనాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో వైసీపీకి చెందిన అన్వర్‌ బాషా,సలీం అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *