అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 7 లాంచ్‌

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 7 లాంచ్‌

షావోమీ…చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీకి తక్కువ బడ్జెట్‌లో ఫోన్లను తీసుకురావడం ఎలాగో తెలుసు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఫోన్లను మార్చే యువతరానికి తగ్గట్టు కొత్త మోడళ్లను అందించడం ఎలాగో తెలుసు. ఇపుడు కొత్తగా తెచ్చిన మోడల్ గురించి తెలిస్తే అందరూ దీన్నే కొంటారేమో అనిపిస్తోంది….

షావోమీ చైనా మార్కెట్‌లో రీసెంట్‌గా విడుదల చేసిన ఫోన్ రెడ్‌మి నోట్7. దీని ప్రత్యేకత ఏంటంటే…దీని బ్యాక్ కెమెరా 40 మెగాపిక్సల్. షాకింగ్‌గా ఉందా? మీరు చదివింది నిజం. రెడ్‌మి నోట్7 కి బ్యాక్ కెమెరా 48MPతో + 5 MP డ్యుయెల్ కెమెరాతో పాటు, 13 MP ఏఐ సెల్ఫీ కెమెరా కూడా దీని ప్రత్యేకత. పైగా ఈ ఫోన్ 4000 Mah బ్యాటరీ కలిగి ఉంది. 

Redmi Note 7

రెడ్‌మి నోట్7 ప్రీమియమ్ లుక్‌తో గ్రేడియంట్ కలర్ డిజైన్ కలిగి ఉంది. 6.3 అంగుళాల గుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, వాటర్ డ్రాప్ డిస్‌ప్లే, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎమెం హెడ్‌ఫోన్ జాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి పలు ప్రత్యేకలు ఉన్నాయి. ఈ ఫోన్ ప్రధానంగా 3జీబీ, 4జీబీ, 6జీబీ ర్యాంతో…32జీబీ, 64జీబీ మేమోరీ వేరియంట్‌లలో వినియోగదారులకు అందుబాటులో వస్తుంది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో దొరుకుతున్న ఈ ఫోన్ అక్కడి ధరలతో పోల్చుకుంటే…భారత మార్కెట్‌లో రూ. 10,000 నుంచి రూ. 15,000 ధరల్లో లభిస్తుంది. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *