షావోమీ సూపర్ బైసైకిల్

షావోమీ సూపర్ బైసైకిల్

టెక్నాలజీలో ఎప్పటికపుడు కొత్త కొత్త వింతలు జరుగుతూనే ఉంటాయి. రకరకాల డిజైన్‌లలో వస్తువులు, వాహనాలు వస్తూనే ఉన్నాయి. వీటిలో ప్రముఖంగా ఉండే ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ షావోమీ. తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ బై్‌సైకిల్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

హిమో పేరుతో లాంచ్ చేసిన ఈ వెహికల్ పేరు హిమో టీ1. ఈ బై్‌సైకిల్‌కు 90ఎంఎం వెడల్పాటి టైర్లు, వన్ బటన్ స్టార్ట్, మల్టీ కాంబినేషన్ స్విచ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఎన్ని ప్రత్యేకతలున్నాయి. హిమో టీ1 ధర మన కరెన్సీలో రూ. 30,700గా ఉంది. చైనా మార్కెట్‌లో వీటి అమ్మకాలు జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. దీని బరువు 53 కేజీలు ఉంటుంది. రెడ్, గ్రే, వైట్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇక షావోమీ కంపెనీ ప్రవేశపెట్టిన హిమో టీ1లో లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 14,000 ఎంఏహెచ్. 48వీ ఓల్టేజ్ కలిగి ఉంటుంది. వీటిలోనే 14ఏహెచ్, 28ఏహెచ్ ఎనర్జీ ఆప్షన్స్‌లో లభిస్తుంది. 14ఏహెచ్ ఆప్షన్‌తో ఉండే ఎలక్ట్రిక్ బైసైకిల్ 60 కిలోమీటర్లు వెళ్తుంది. అదే 28 ఏహెచ్ ఆప్షన్‌తో అయితే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *