ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్స్‌రేల కోసం రోగుల తంటాలు

ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్స్‌రేల కోసం రోగుల తంటాలు

ఆ పెద్దాసుపత్రి సంజీవనిగా గుర్తింపు పొందింది. నిత్యం వేలాది మంది చికిత్స కోసం వస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంటుంది. మరి ఇంతలా గుర్తింపు ఉన్న ఆస్పత్రిలో ఎక్స్‌రే మిషన్ పనిచేయడం లేదు. దీంతో కర్నూలు ఆస్పత్రికి వెళ్లాలంటేనే రోగులు జంకుతున్నారు.

కర్నూలులోని సర్వజన హాస్పిటల్‌కి నిత్యం దాదాపు 3 వేల మందికి పైగా వైద్యం కోసం వస్తుంటారు. అయితే ఇందులో సుమారు 500 పైచీలుకు ఎక్స్‌రే కోసమే వస్తుంటారు. ఎమర్జెన్సీ విభాగం వద్ద ఉన్న రేడియాలజీ డిపార్ట్మెంట్‌లో నాలుగు ఎక్స్ రే మిషన్స్ తో పాటు ఏడు మొబైల్ ఎక్స్ రే మిషన్స్ ఉన్నాయి. అయితే ఇందులో నాలుగు ఎక్స్‌రే మిషన్స్ తో పాటు సిఆర్ మిషన్ కూడా పనిచేయడం లేదు. దీంతో రోగులు ఎక్స్‌రే కాపీలు సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఎక్స్‌రేలు రాకపోవడంతో చికిత్సకు చాలా సమయం పడుతోంది. ఇలా రోజులు గడుస్తున్నా పరిస్థితో మార్పు రాకపోవడంతో కొందరు ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. మరికొందరు డబ్బులు వెచ్చించే స్థొమత లేక ఎక్స్‌రేల కోసం అక్కడే పడిగాపులు కాస్తున్నారు.

సర్వజన హాస్పిటల్లో ఎక్స్ రే తో పాటు బీపీ, వెంటిలేటర్ మిషన్స్ సంబంధించి నిర్వహణ బాధ్యత టీబిఎస్ సంస్థ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చినందుకుగాను ఆ సంస్థకు కోట్ల రూపాయలు దారపోస్తుంది. మిషన్స్ ఏదైనా రిపేరి వస్తే.. టిబిఎస్ కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా మరమత్తులు చేయించి చేతులు దులుపుకుంటున్నారు. సంభందిత మెషిన్స్‌కి పక్కా ప్రోఫైషనల్ మెకానిక్స్ లేకపోవడమే. పెద్దాస్పత్రిలో ఏ మిషన్ రిపేరి వచ్చినా లోకల్ గా చేసేవారు లేరు. హైదరాబాద్, చెన్నై నగరాల నుంచి వచ్చి రిపేర్ చెయ్యాల్సిన పరిస్థితి.

టిబిఎస్ సంస్థ ముడేళ్ల నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వాస్పత్రులలో మెయింటనెన్స్ బాధ్యతలు తీసుకుంది. నిభందనలు ప్రకారం నిర్వాహకులు తప్పనిసరిగా వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలా కర్నూలు ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సొమ్ము మాత్రం వృథాగా ఖర్చు అవుతున్న అధికారలు కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. దీంతో స్థానికులు, ప్రజా సంఘాలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. చూడాలి మరి అధికారులు ఇప్పటికైన టీబిఎస్‌ సంస్థపైన చర్యలు తీసుకుని ఆస్పత్రికి మహర్థశను తీసుకువస్తారో లేదో.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *