ప్రపంచకప్‌ 'సెమీస్‌' చేరేదెవరు?

ప్రపంచకప్‌ 'సెమీస్‌' చేరేదెవరు?

ప్రపంచకప్‌ అసలుసిసలు సమరానికి రెడీ అయ్యింది. గెలుపు కోసం అర్రులు చాస్తున్న క్రికెట్‌ జట్లు తాడోపేడో తేల్చుకోడానికి రెడీ అయ్యాయి. ఎలాగైనా గెలిచి సెమీస్‌ రేస్‌లో నిలవాలనే కోరికతో ఉవ్విళ్లూరుతున్నాయి. క్రికెట్‌లో ఎన్ని కప్పులు గెలిచినా.. వరల్డ్‌కప్‌ గెలవాలనే ప్రతి జట్టు తీవ్రంగా శ్రమిస్తుంది. దీంతో చివరి దాకా పోరాడి.. విజయం సాధించాలనే కలను కంటోంది. దీంతో ఫైనల్‌కు ముందు ఏ జట్టు సెమీస్‌కు చేరుతుందో..? లేక బోల్తా పడుతుందో చూడాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే..

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతన్న క్రికెట్‌ విశ్వసమరం రసవత్తరంగా మారుతోంది. టోర్నీ ఆరంభంలో వర్షాలతో డీలా పడ్డ జట్లు అనూహ్య పోరాటాలతో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక లీగ్‌ మ్యాచ్‌లు తుది దశకు చేరుతుండటంతో సెమీస్‌ నాలుగు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే ప్రపంచకప్‌లో పాల్గొన్న పది జట్లలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్‌ అధికారికంగా సెమీస్‌ రేసును ఇంచి నిష్క్రమించాయి. ఇప్పటికే శ్రీలంక అనధికారికంగా సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. మిగిలిన ఆరు జట్లలో 14 పాయింట్లతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది.

ఇక న్యూజిలాండ్‌, టీమిండియా జట్లు సెమీస్‌ చేరడం కష్టమేమీ కానప్పటికీ తదుపరి ఆడే మ్యాచ్‌లు వాటికి కీలకంగా మారనున్నాయి. కాగా నాలుగో స్థానం కోసమే తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌ గెలుపోటములుతో సతమతమవుతోంది. చెప్పాలంటే ఆతిథ్య ఇంగ్లండ్‌ ఆటగాళ్లతో పాటు అభిమానులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరోవైపు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు పలు సంచలనాల విజయాలు నమోదు చేసి సెమీస్‌కు చేరాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ప్రపంచకప్‌ మరింత ఉత్కంఠగా మారింది. దీంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

సీన్‌కట్‌ చేస్తే.. టోర్నీని ఘనంగా ఆరంభించి, భారీ విజయాలు నమోదు చేయడంతో ఈ సారి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ ఏదో చేయబోతుందని అందరూ భావించారు. కానీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి సీన్‌ రివర్సయింది. ఆసీస్‌ చేతిలో కంగుతిని, పాక్‌, లంక చేతిలో ఘోరంగా పరాజయం పాలయింది. దీంతో ఏకంగా సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటివరకు ఇంగ్లండ్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు, మూడు పరాజయాలతో 10 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. తదుపరి బలమైన కివీస్‌ జట్టుతో తలపడి ఓడితే ఇంగ్లండ్‌ సెమీస్‌ ఆశలకు గండిపడుతుంది.

అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్‌ తాజా ప్రపంచకప్‌ను ఘనంగా ఆరంభించింది. వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ జట్లను ఓడించి అందరికీ షాక్‌ ఇచ్చింది. అనంతరం ఆసీస్‌, టీమిండియాపై ఓడిపోయి విమర్శల పాలైంది. అనంతరం పుంజుకొని దక్షిణాఫ్రికాను ఇంటికి పంపించి, కివీస్‌పై స్పూర్తి దాయక విజయం అందుకొని.., అఫ్గానిస్తాన్‌ను చిత్తుచేసింది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన పాక్‌ నాలుగు మ్యాచ్‌లు గెలిచి, మూడింట ఓటమిచెంది. ఇక ఒక్క మ్యాచ్‌ రద్దవడంతో పాక్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పాక్‌ సెమీస్‌ చేరాలంటే మిగిలిన బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి.

సంచలనాల బంగ్లాదేశ్‌ తాజా ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలు, ఒక్క మ్యాచ్‌ రద్దవడంతో.. ఏడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో తమ కంటే బలమైన పాకిస్తాన్‌ జట్టుతో తలపడి గెలవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంగ్లండ్‌.. కివీస్‌తో ఓడిపోతే బంగ్లా సెమీస్‌ వెళ్లే అవకాశం ఉంది. ఇక తమదైన రోజు ఎంతటి బలమైన జట్టునైనా ఓడించే బంగ్లా తన తదుపరి మ్యాచ్‌ల్లో ఎలా ఆడుతుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *