వరల్డ్‌ కప్‌లో నేడు తొలి సెమీఫైనల్‌

వరల్డ్‌ కప్‌లో నేడు తొలి సెమీఫైనల్‌

ప్రపంచ కప్ టోర్నీలోకి.. బారీ అంచనాలతో దిగిన ఫేవరేట్ టీమ్స్ అనుకున్నట్లుగానే సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. తొలి సెమిఫైనల్‌లో మంగళవారం భారత్‌ – న్యూజిలాండ్‌ టీమ్స్‌ తలపడనున్నాయి. కాగా.. రెండూ టీమ్స్‌ ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి… మాంచెస్టర్‌ మ్యాచ్‌లో భారత్‌కి కలిసొచ్చే అంశాలేంటి? కొహ్లీ ధీమాకు కారణాలేంటి? లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ..

ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో అదరగొట్టడం ద్వారా సెమీఫైనల్ కు చేరింది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచులన్నీ ఒకెత్తయితే ఇకపై జరిగే రెండు మ్యాచులు మరోఎత్తు. సెమీ ఫైనలో ఏమాత్రం తడబడినా మరో ఛాయిస్ వుండదు. నేరుగా ఇంటిదారి పట్టాల్సి వుంటుంది. ఇలాంటి కీలక మ్యాచుల కోసం తాము మరింత పకడ్బందీగా సన్నద్దమవుతున్నట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

మంగళవారం మాంచెస్టర్ వేదికపై జరిగే మొదటి సెమీ ఫైనల్‌లో ప్రత్యర్థిని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందంటూ కొహ్లీ వెల్లడించారు. కివీస్ ను బలమైన జట్టు అంటూనే… దానిని ఎదుర్కొనేందుకు భారత బ్యాటింగ్‌ విభాగం సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. అయితే గతంలో మాదిరిగానే ఈ మ్యాచ్ లోనూ టాస్ కీలకం కానుందన్నాడు.

ఇక లీగ్ దశలో వరుస విజయాలు సాధించి పాయింట్ టేబుల్ లో టాప్ కు చేరడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందన్నాడు. ఇలా ఎలాంటి అడ్డంకులు లేకుండా సునాయాసంగా సెమీస్ కు చేరడంతో ఆటగాళ్లపై ఒత్తడి లేదన్నాడు. కాబట్టి సెమీస్ లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు కొహ్లీ. పనిలో పనిగా.. రోహిత్‌ ఆటతీరునూ ప్రశంసించాడు.

మొత్తానికి భారత్‌ ఆటగాళ్లు గెలుపుపై గట్టి ధీమాతో కనిపిస్తున్నారు. మరి.. మాంచెస్టర్‌ మ్యాచ్‌ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *