నైట్ డ్యూటీ ఆరోగ్యానికి హానికరం.. ఉద్యోగస్తులు జర జాగ్రత్త!

నైట్ డ్యూటీ ఆరోగ్యానికి హానికరం.. ఉద్యోగస్తులు జర జాగ్రత్త!
జనరేషన్ మారేకొద్దీ యువతలోనే కాకుండా మధ్య వయసు వారు కూడా రాత్రి పూట మేల్కొని పనిచేస్తున్నారు. ఆఫీస్ పని ఎక్కువ ఉందనో…రేపటి వర్క్ ఇవాళే చేద్దామనో..రాత్రిపూట జాగారణ చేస్తున్నారు. ఇంకా ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారికి ఏ వారం ఏ పూట వర్క్ ఉంటుందనేది వారికే తెలీదు. దీంతో ఒక వారం పగలు పనిచేస్తే..మరొక వారం రాత్రి డ్యూటీ చేస్తున్నారు. 
 
night shift effects
 
అయితే ఈ నిద్రలేమి గురించి పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు నిద్ర లేని వారికి డీఎన్ఏ సమస్య వస్తుందని చెబుతున్నారు. రాత్రిపూట ఉద్యోగం చేసే వారికి డీఎన్ఏ సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని వెల్లడైంది. దీనివల్ల కేన్సర్, జీవక్రియ, హృదయ, నాడీ వ్యవస్థకు సంబంధిచిన వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకుల అధ్యయనంలో పూర్తీ సమయం విధులు నిర్వర్తించే 49 మంది వైద్యుల రక్త నమూనాలను వివిధ సమయాల్లో సేకరించారు. 
 
night shift effects
 
ఈ పరిశోధన గురించి మాట్లాడుతూ…” ఈ పరిశోధనలో స్పష్టమైన ఫలితాలు వచ్చాయి. రాత్రిపూట విధులు నిర్వర్తించే వారికి నిద్రలేమి సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా డీఎన్ఏ కూడా దెబ్బతింటోంది. ఇవి కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. ” అని ప్రకటించారు. ఈ విషయాల్ని పరిశోధకుల్లో ఒకరైన సియూ వై చోయ్ తెలిపారు. డీఎన్ఏ ఎంత మేరకు దెబ్బతింటే అంత ఎక్కువగా నిద్రలేమి సమస్య తీవ్రమవుతోందని చెప్పారు. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *