లిఫ్ట్‌లో చిన్నారిపై మహిళ అరాచకం

లిఫ్ట్‌లో చిన్నారిపై మహిళ అరాచకం

ఈ మధ్యకాలంలో మనుషుల ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. అకారణంగా అర్థంలేని పనులు చేస్తూ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి మానసిక సమస్యతోనే ఓ మహిళ నాలుగేళ్ల చిన్నారిని విచక్షణా రహితంగా కొట్టింది. ఆమె ఎవరో, ఏంటో తెలుసుకుందాం…

ముంబై శివార్లలో ఉండే ట్రాంబే ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన సంఘటన ఇది. సీసీటీవీలో రికార్డవటం వల్ల ఈ ఘటన గురించి బయట తెలిసింది. చిన్నపాపను దుర్మార్గంగా కొట్టిందని, ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

పక్కన ఉన్నవాళ్లు వారించినా…

రిజ్వానా బేగం అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రిజ్వానా బేగం లిఫ్ట్‌లో తనతో పాటు ఉన్న చిన్నపాపను విపరీతంగా కొట్టింది. బయట ఉన్న వ్యక్తులు ఎంత వారించినా వినకుండా కొడుతూనే ఉంది. ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నా కనికరం లేకుండా కొట్టింది. కొందరు ప్రయత్నించి పాపను కాపాడేందుకు వెళితే పాపపై కూర్చుని సైకోలా ప్రవర్తించింది. కొంత సమయం తర్వాత పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు.

ఆమె వద్ద పాప వేసుకునే చెవిరింగులు దొరికాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటన గురించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *