జన్మనిచ్చిన నెలరోజులకే మళ్లీ కవలలు

జన్మనిచ్చిన నెలరోజులకే మళ్లీ కవలలు

అప్పుడప్పుడూ వింతలు జరుగుతుంటాయి. కాలం మన నమ్మకాల మీద దెబ్బకొట్టి ఆశ్చర్యాలను పరిచయం చేస్తుంది. కచ్ఛితంగా షాక్‌కు గురిచేస్తుంది. అసాధ్యమనుకున్నవాటిని సాధ్యం చేసి మన ఎదురు నెలబెడతాయి. ఈ సంఘటనా అలాంటిదే. ఇప్పటివరకూ మనం… ఒకే కాన్పులో కవలలు పుట్టడం చూశాం. ఒకేసారి ముగ్గురికి జన్ననిచ్చిన తల్లుల గురించి విన్నాం. ఒకే కాన్పులో నలుగురైదుగురికి జన్ననిచ్చిన అమ్మల గురించీ తెలుసుకున్నాం. కానీ ఇద్ది వాటన్నింటి కంటే భిన్నమైంది. కాన్పు జరిగిన నెలరోజుకే ఒక తల్లి… కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఈ కథేంటో పూర్తిగా తెలియాలంటే… స్టోరీలో ఇంకాస్త ముందుకెళ్లాల్సిందే.

అరుదైన సంఘటన…

ఈ అరుదైన సంఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. కాన్పు జరిగిన నెలరోజులకో ఆ తల్లి కవలలకు జన్ననిచ్చింది. ఈ అమ్మపేరు అరిఫా సుల్తానా ఐతీ. వయసు 20 ఏళ్లు. బంగ్లాదేశ్‌లోని జెస్సోరిలో నివాసముంటోంది. ఫిబ్రవరి 25న సుల్తానాకు పురిటినెప్పులు వచ్చాయి. వెంటనే ఎలర్ట్‌ అయిన భర్త… అక్కడకి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాడు. ప్రసవం సుఖాంతమైంది. 24 గంటలు అబ్సర్వేషన్‌లో ఉంచారు. తల్లీబిడ్డా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారనిపించడంతో ఇంటికి పంపేశారు. నెలరోజుల వరకూ అంతాబాగానే ఉంది. ఆ తర్వాతే స్టోరీ మలుపు తిరిగింది. మార్చి 22న సుల్తానాకు మళ్లీ పురుటినొప్పులు వచ్చాయి. ప్రసవమైన నెలరోజులకే మళ్లీ నొప్పులు రావడంతో షాక్‌ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు… సుల్తానా గర్భంలో మరో ఇద్దరు పిల్లలున్నరాని షాకింగ్ న్యూస్‌ చెప్పారు. ఈ కవలలు వెన్నుపూస వెనుక భాగంలో ఉండటంతో ఆపరేషన్‌ చేసి బయటకు తీశారు. మొదటి విడత మగబిడ్డకు జన్మనిచ్చిన సుల్తానా, రెండో విడత ఒక ఆడబిడ్డనూ, ఒక మగబిడ్డనూ కన్నది.

అందుకే ముందు గుర్తించలేదు…

ప్రతి 10 లక్షల మంది మహిళల్లో ఒకరికి రెండు గర్భాశయాలుంటాయి. సుల్తానా విషయంలోనూ అదే జరిగింది. మొదటి కాన్పు సమయంలో ఈ విషయాన్ని డాక్టర్లు గమనించలేదు. తాము ఇంతవరకూ ఇలాంటి కేసును చూడలేదనీ… తమకు తెలిసీ ఇలా జరగటం ఇదే మొదటిసారనీ బంగ్లా వైద్యులు చెప్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *