లంచమడిగితే..చెప్పుతో సమాధానం చెప్పింది!

లంచమడిగితే..చెప్పుతో సమాధానం చెప్పింది!

అడ్డంగా సొమ్ము దోచుకోవాలని చూసిన వ్యక్తిని ఒక మహిళ తగిన బుద్ధి చెప్పింది. ఎవరైన లంచం అడిగితే చాలా సందర్భాల్లో చాలామంది ఎంతోకొంత ముట్టజెప్పి పని ముగించుకుంటారు. మరికొందరు ఫిర్యాదు చేసి అలాంటివారిని అవినీతి నిరోధక శాఖవారికి పట్టిస్తారు. అయితే..ఏళ్లుగా ఇలాంటి లంచగొండులకు ఇలాగే శిక్షిస్తున్నా లంచం తీసుకునే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. ఇలాంటి సంఘటనలను చూసి చూసి విసిగిపోయిన ఓ మహిళ తగిన శాస్తి చేయాలని డిసైడ్ అయింది. దానికి ఆమె ఎంచుకున్న మార్గాన్ని మిగిలిన వారు కూడా పాటిస్తే మనదేశంలో లంచం అనే వ్యవహారం తుడిచిపెట్టుకుపోతుందని నమ్మొచ్చు..! ఇంతకూ సదరు మహిళ చేసిన పనేంటో చదువుదాం!

అవినీతి నిరోధక శాఖ అధికారినని చెబుతూ…రూ.50వేల కోసం డిమాండ్ చేసిన ఒక వ్యక్తిని ఓ మహిళ చితగ్గొట్టింది. అడిగిన డబ్బులు ఇస్తానంటూ ఫోన్ చేసి పిలిచి ఏసీబీ అధికారిగా చెప్పుకునే వ్యక్తిని నడిరోడ్డుమీదే అందరూ చూస్తుండగా చెప్పుతో ఆ వ్యక్తికి బుద్దొచ్చేలా చేసింది. జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్ పూర్‌లోని మాంగో ఏరియాలో ఈ సంఘటన జరిగింది. మహిళ బంధువులు కూడా నడిరోడ్డులో ఆ వ్యక్తిని కర్రతో ఉతికిపడేశారు. మహిళ ఇచ్చిన సమాచారంతో ముందుగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కుటుంబసమస్యల నుంచి బయటపడేందుకు సాయం చేస్తానంటూ ఏసీబీ అధికారిగా చెప్పుకునే ఓ వ్యక్తి 50వేలు డిమాండ్ చేశాడని మహిళ ఫిర్యాదు చేసినట్లు మాంగో ఎస్సై అరుణ్ మెహతా వెల్లడించారు. అతని దగ్గర ఫేక్ ఐడీ కార్డులనూ గుర్తించినట్లు ఆయన తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *