బిడ్డను మర్చిపోయి ప్లైట్ ఎక్కింది..ఆ బాధ చూడలేక విమానమే వెనక్కితిరిగింది

బిడ్డను మర్చిపోయి ప్లైట్ ఎక్కింది..ఆ బాధ చూడలేక విమానమే వెనక్కితిరిగింది
కొన్నికొన్ని సంఘటనలు భలే అనిపిస్తాయి. ఆ దృష్యాలు మన కళ్లని చెమరుస్తాయి. ఎలాంటి సమయంలో అయినా, ఎటువంటి సందర్భంలో అయినా మనిషి కోసం మనిషి సాయం చేయగలడని నిరూపిస్తాయి. ఆత్మీయ బంధాలు మందు ఎలాంటి నియమాలైనా కుప్పకూలిపోతాయి. అలా ఓ తల్లి ప్రేమ, బాధ విమానాన్నే వెనక్కి తిప్పాయి. టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగి ప్రయాణం మొదలైన చోటుకే చేర్చాయి. ఈ సంఘటనను మనమూ హత్తుకుందాం పదండి.
అలా ముగిసింది…
ఈ సంఘటన సౌదీలో జరిగింది. ఇప్పటివరకూ ఎప్పడూ జరగని ఇలాంటి సన్నివేశంలో ఆ విమానసంస్థ మానవీయతతో కూడిన నిర్ణయాన్ని తీసుకుంది.  సౌదీలోని జెడ్డా నుంచి మలేషియాలోని కౌలాలంపూర్‌కు ఆ విమానం ప్రయాణమైంది. ఒక తల్లి తన బిడ్డను మర్చిపోయి విమానం ఎక్కేసింది. పక్కన తన బిడ్డ లేదన్న విషయాన్ని టేకాఫ్ అయినా కాసేపటికి గానీ గమనించలేదు. ఒక్కసారిగా ఆమె ప్రాణం పోయినట్టైంది. విమానాన్ని వెనక్కి తిప్పమని పైలట్లని ప్రాధేయపడింది. నియమాలకు వ్యతిరేకంగా తాము ఆ పని చేయలేమన్న పైలట్లు సమాచారాన్ని సిబ్బందికి అందజేశారు. ఆ సంస్థ ఈ విషయాన్ని హృదయంతో ఆలోచించింది. సౌదీ చరిత్రలోనే తొలిసారిగా జరిగిన సంఘటనకు మంచి నిర్ణయాన్ని తీసుకుంది. తక్షణమే విమానాన్ని వెనక్కి తిప్పవల్సిందిగా పైలట్లకు ఆదేశాలను జారీ చేసింది. విమానం జెడ్జా ఎయిర్‌పోర్ట్లో ల్యాండ్‌ అవ్వగానే… పరిగెత్తూకుంటూ వెళ్లిన ఆ తల్లికి వెయిటింగ్‌ ఏరియాలో తన బిడ్డ కనిపించింది. అప్పటి వరకూ తన ఊపిరిఊపిరిలో లేదని పైలట్‌కూ, విమానయాన సంస్థకూ కృతజ్ఞతలు తెలుపుకుంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *