హగ్‌ చేసుకోవడమే ఆమె ఉద్యోగం...జీతం రూ. 28 లక్షలు

హగ్‌ చేసుకోవడమే ఆమె ఉద్యోగం...జీతం రూ. 28 లక్షలు
ఎంత బాధలో ఉన్నా సరే… మన అనుకున్న మనుషులు దగ్గరగా ఉన్నా, వారిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నా కాసింత రిలీఫ్‌ కలుగుతుంది. లోలోపల పేరుకుపోయిన భారపు బరువు తగ్గుతుంది. ఆ అవకాశం లేనివారికి బాధకు ఒంటరితనం తోడై, సమస్య ఇంకాస్త పెద్దదవుతుంది. ఎప్పుడైనా సరే, ఏ ప్రాంతం వారికైనా సరే తోడుగా ఒక మనిషుండాలి, వాళ్లు ప్రేమతో ఇచ్చే ఆలింగనపు భరోసా ఉండాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఆమె ఒక ఆలోచన చేసింది. ఒంటరి మనుషులను హత్తుకుంటానికి నేనున్నానంటూ… చేతులు చాపుతోంది.

అదీ కథ…

ఆమె పేరు రాబిన్‌ స్టిన్‌. అమెరికాలోని కన్సార్‌లో ఉంటుంది. మనిషిని ఆలింగనం చేసుకుని, వారి ఒత్తిడిని తగ్గించడాన్నే తన వృత్తిగా మార్చుకుంది.  “ఎవరినైనా కౌగిలించుకుంటే వారి శరీరం చాలా రిలాక్స్‌ అవుతుంది. దానీ ద్వారా సంతోషంగా ఉండటానికి సహకరిచంఏ ఆక్సిటోసిన్ విడుదల అవుతోంది. ఒత్తిడిని తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది. కొందరు నోరు తెరిచి తమ సమస్యను ఎదుటివారికి చెప్పుకోలేరు. అలాంటి వాళ్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు నేనూ బాగా ఒత్తిడితో ఉండేదాన్ని. నా సమస్యను ఎవరితోనూ చెప్పుకునే అవకాశం ఉండేది కాదు. అప్పుడే నాకు ఈ ఉపాయం తట్టింది” అని … ఈ వృత్తిని ఎంచుకోవడానికి వెనుకున్న కథను రాబిన్‌ స్టిన్‌ చెప్తోంది.

గంటకు రూ.5630

రాబిన్ స్టిన్ కౌగిళ్లో సేదతీరి ఒత్తిడి తగ్గించుకోవడం అందరికీ సాధ్యం అయ్యే పనేం కాదు. బాగానే పైకం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గంటకు రూ.5,630 చెల్లించిన వారికే ఈ అవకాశం దక్కుతుంది. లింగ బేధాల్లేకుండా… ఎవరైనా సరే ఆమెను హత్తుకుని నిద్రపోవచ్చు. నిలబడి ఉండొచ్చు. అయితే ఇదంతా కేవలం థెరపీ మాత్రమేననీ, సెక్స్‌కు అవకాశం లేదనీ తేల్చిచెప్పేసింది. రాబిన్‌ ఆలింగనం కోసం ఎంతో మంది క్యూలు కడుతున్నారు. ప్రస్తుతానికి ఏడాదికి రూ. 28 లక్షలు సంపాదిస్తోంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *