ముద్దుకోసం కక్కుర్తి పడి నాలుక పోగొట్టుకున్నాడు!

ముద్దుకోసం కక్కుర్తి పడి నాలుక పోగొట్టుకున్నాడు!

అమ్మాయిని ప్రేమించాడు. నాలుగు నెలలు అవగానే వదిలేద్దాం అనుకున్నాడు. విడిపోతూ ఆమెకు చివరి ముద్దు ఇద్దామని ప్రయత్నించాడు. ముద్దు పెడుతూ నాలుకను పోగొట్టుకున్నాడు. విషయంలోకి వెళ్తె…ప్రియుడు లవ్‌కు బ్రేక్ అప్ చెప్పడం అమ్మాయికి ఇష్టం లేదు. దీంతో బాధపడిన ఆ అమ్మాయి…ఎలాగైన అతనికి తగిన బుద్ధి చెప్పాలనుకుంది.ఒకరోజు అతడిని ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పింది. కొంతసేపటికి కోపం తగ్గినట్టు నటించి..అతనికి క్షమాపణలు చెప్పింది. ఎలాగూ విడిపోతున్నాం కదా..చివరిసారిగా ముద్దు ఇమ్మని అడిగింది. తనే ముద్దు అడిగింది కదా అని కక్కుర్తి పడి ప్రియుడు ముద్దు ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ముద్దు ఇచ్చినట్టే ఇచ్చిన ఆ యువతి అతడి నాలుకను గట్టిగా కొరికేసింది. ఎంతలా అంటే…అతడి నాలుక తెగిపోయి ఆమె నోట్లోకి వచ్చేంతగా..! నాలుక తెగిపోవడంతో యువతి అక్కడినుంచి పారిపోయింది. ప్రియుడు మాత్రం నాలుక తెగిన బాధలో గట్టిగా కేకలు వేస్తూ అరిచాడు. స్థానికులు అతని పరిస్థితి చూసి దగ్గరలోని హాస్పిటల్‌లో చేర్చారు. ఈ సంఘటన 2017లో జరిగింది. ఆరోజు పారిపోయిన ఆ యువతి కొన్నాళ్లకు కోర్టులో హాజరయింది. అప్పుడు కోర్టు ఆమెను మందలించి వదిలేసింది. ఈ ఘటన గురించి మళ్లీ ఇపుడు ఎందుకు చర్చ వచ్చిందంటే…నాలుక కోల్పోయిన సదరు బాధితుడి తరపు న్యాయవాది ఈ మధ్యనే ఆ కేసుని మళ్లీ కోర్టు ముందుకు తీసుకొచ్చాడు. ఆమెకు ఎనిమిదేళ్లు శిక్ష వేయాలని కోరాడు. అయితే..ఆమె మాత్రం ఇపుడు ఆ నేరాన్ని అంగీకరించకుండా..అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టి పడేసింది. అలా ఆ యువతి బ్రేకప్ కథ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇపుడు కోర్టు శిక్ష వేస్తుందా..! కేసుని కొట్టేస్తుందా చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *