పొట్టి దుస్తులు వేసుకుంటే రేప్ చేయాలన్న మహిళను ఆటాడుకున్న ఇద్దరు అమ్మాయిలు!

పొట్టి దుస్తులు వేసుకుంటే రేప్ చేయాలన్న మహిళను ఆటాడుకున్న ఇద్దరు అమ్మాయిలు!

కొందరికి సమాజం, సమాజంలోని వ్యక్తులకు రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులుంటాయి అనే కనీస అవగాహన లేకుండా మాట్లాడేస్తారు. ఎంతటి నీచమైన వ్యాఖ్యలనైనా అనేసి దాన్ని సమర్థించుకుంటారు. ఈ మధ్యకాలంలో ప్రజలను పాలించే నాయకులే చాలాసార్లు చాలా సందర్భాల్లో నోరు జారిన సంఘటనలు చూశాం. అమ్మాయిలు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో చెబుతారు, అమ్మాయిలు అలాంటి డ్రెస్సులు వేసుకుంటే అబ్బాయిలు రేప్ చేయరా అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. ఇలాంటి వ్యాఖ్యలన్నీ బుద్ధి మందగించాకే వస్తాయి. అమ్మాయిల దుస్తులను బట్టి వారిని లోబరుచుకోవాలనే నీచత్వానికి మన సమాజం దిగజారిపోయిందని తెలుసుకోలేరు. ఇలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. ఇలాంటి మనుషులు మనమధ్యే బతుకుతున్నారు అనేందుకైనా తెలుసుకోవాలి!

ఢిల్లీలో ఓ మధ్యవయస్కురాలైన మహిళ.. పొట్టి బట్టలేసుకునే అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. నగరంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళ అక్కడ పొట్టి పొట్టి డ్రస్సులతో ఇద్దరు అమ్మాయిలను చూసింది. ఇలాంటి డ్రస్సులు వేసుకుంటే.. అబ్బాయిలు రేప్ చేయకుండా.. ఏం చేస్తారు అని వాగేసింది. ఆ వ్యాఖ్యలతో షాక్ తిన్న అమ్మాయిలు.. మహిళతో గొడవకు దిగారు. ఆమె అక్కడితో ఆగకుండా.. అక్కడే కూర్చొన్న యువకుల దగ్గరకు వెళ్లి పొట్టి డ్రస్సులు వేసుకునే అమ్మాయిలను రేప్ చేయండి అంటూ గట్టిగా అరిచి చెప్పింది.

దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ అమ్మాయిలు ఆమెను వదల్లేదు. ఆ మహిళ రెస్టారెంట్ నుంచి ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్తే…ఆ ఇద్దరమ్మాయిలు ఆమెను వెంబడించారు.. క్షమాపణలు చెప్పి తీరాలంటూ హెచ్చరించారు. ఆమె ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు.. క్షమాపణ చెప్పేదీ లేదనేసింది. అమ్మాయిలు కూడా ఏమాత్రం వెనక్కు పోలేదు.. సారీ చెప్పాల్సిందేనన్నారు. ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినా యువతులు వదల్లేదు. దీంతో సదరు మహిళ పోలీసుల్ని పిలవండి.. క్షమాపణలు చెప్పేది లేదంటూ పెద్దగా కేకలు వేసింది. రెస్టారెంట్ దగ్గర నుంచి షాపింగ్ మాల్ వరకు ఆ మహిళను వెంబడించిన ఇద్దరు యువతులు మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. షాపింగ్‌మాల్‌లో మరో మహిళ వచ్చి అలా అనడం కరెక్ట్ కాదు, ఈ అమ్మాయిల స్థానంలో నేనుంటే మాటలతో కాదు చేత్తో సమాధానం చెప్పేదాన్ని అంటు బుద్ధి చెప్పినా సదరు మహిళ అప్పటికి కూడా అదే అహంకారంతో మాట్లాడింది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *