ఆయన లక్ష కోట్లు దానం చేసిన అత్యంత సంపన్నుడు!

ఆయన లక్ష కోట్లు దానం చేసిన అత్యంత సంపన్నుడు!

ప్రపంచంలో ఎవరైనా సంపాదించేది తన కుటుంబం బాగుండాలని,తన తర్వాత తరాలు ఏ కష్టం లేకుండా జీవించాలని కానీ అలాంటి వాటికి భిన్నంగా జీవిస్తున్నాడొక వ్యక్తి.తాను సంపాదించే దానిలో ఎక్కువ భాగం దానధర్మాలకు ఖర్చు చేస్తూ దేశంలోని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.ఆయనే అజిమ్ ప్రేమ్‌జీ.ఇండియాలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఆయన రెండోవ్యక్తి.పేరుకి సంపన్నుడే కానీ ఆయన సంపాదించే దానిలో 35 శాతం దాతృత్వానికి కేటాయిస్తాడు.ప్రస్తుతం దేశంలో దానధర్మాలకు ఖర్చు చేసేవారిలో ఈయనే మొదటివాడు.ఇప్పటిదాకా ఆయన 1.45 లక్షల కోట్లు దానం చేశాడు.తన జీవితంలో అత్యంత స్పూర్తివంతంగా నిలిచింది తన అమ్మే అని చెప్పే అజీమ్…ఆమె నేర్పిన జీవిత పాఠాలను తూచా తప్పకుండా పాటిస్తారు.

ప్రేమ్ జీ ఇప్పటిదాకా కేటాయించిన డబ్బు..ఆయనకు విప్రోలో ఉన్న మొత్తం వాటాల్లో 34 శాతానికి సమానం.విప్రో ఆర్జిస్తున్న లాభంలో 67 శాతం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు వెళ్తోందని ఫౌండేషన్ సీఈఓ అనురాగ్ బెహార్ వెల్లడించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు,అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు,లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న సంస్థలకు సాయం చేయడం లక్ష్యంగా ఫౌండేషన్ పని చేస్తోందని చెప్పారు. పోషకాహార లేమి,మహిళా సమస్యలు,గృహహింస,అమ్మాయిల రవాణా వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న 150 సంస్థలకు తాము ఆర్థిక సాయం చేశామని విప్రో సంస్థ ప్రకటించింది.

భారత్‌లో ఐటీ విప్లవానికి నాందిగా నిలిచిన స్వదేశీ సంస్థ విప్రో.ఈ సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపారంలోనే కాదు దాతృత్వంలోనూ అందరికంటే ముందున్నారు.తన పేరిట అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన దేశంలో నాణ్యమైన విద్య,సమానత్వం కోసం తన ఆస్తిలో చాలా భాగం దానం చేశారు.తన ఫౌండేషన్ ద్వారా అనేక స్వచ్ఛంద సేవాసంస్థలకు చేయూతనందిస్తూ వస్తున్నారు.

దేశీయ టెక్ దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఒకానొక సందర్భంలో ఓ విలేఖరి అడిగిన కఠినమైన ప్రశ్నను ఎదుర్కొన్నారు.ప్రేమ్‌జీని మరి కొన్నేళ్ళ తరువాత ఎలా గుర్తు పెట్టుకోవాలి,ఒక వ్యాపార దిగ్గజంగానా? లేక ఒక దానశీలిగానా ?అని ఆ విలేఖరి ప్రేమ్‌జీని అడిగారు.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం మాటల్లో చెప్పలేదు.ప్రశ్న ఎదురైన కొన్ని నెలలకే అజీమ్ ప్రేమ్‌జీ 21 బిలియన్ డాలర్లను దాతృత్వానికి కేటాయించి ఆ విలేఖరికి సమాధానం చేతల్లో చూపించారు.తన ఫౌండేషన్‌ ద్వారా పేదలు,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటు పడటమే కాకుండా దేశంలో విద్యావకాశాలు మరింత పెరగాలని అజీమ్ ఫౌండేషన్ గుర్తించింది.అందుకు అనుగుణంగా లక్షలాది మంది విద్యార్ధులు ఉత్తమ విద్యను అందుకునేలా చర్యలు తీసుకుంటుంది.ఇన్నోవేటివ్ స్కిల్స్ ,ఉత్పాదకత మెరుగుపడే విధంగా ఆయా కోర్సులను పేద విద్యార్ధులకు అందించేలా ఈ సంస్థ ప్రణాళికలు చేపట్టింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *