సాహూని అందుకోవడానికి మరో ఐదేళ్లు పడుతుంది

సాహూని అందుకోవడానికి మరో ఐదేళ్లు పడుతుంది

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ సాహో. హాలీవుడ్ రేంజ్‌లో హై టెక్నికల్ వ్యాల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్స్ పెటేషన్స్ హై రేంజ్‌లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కీల్‌లో చక్కర్లు కొడుతుంది. మరి సాహో గురించి వినిపిస్తోన్న ఈ హాట్ టాపిక్ ఎంటో చూద్దాం.

బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో సినిమా. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అంచనాలు హై రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఫైట్లు కోసం డైరెక్టర్ సుజిత్ హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో చేసిన ఫైట్లు ఓ రేంజ్ లో ఉంటున్నట్లు ఫిలింనగర్ టాక్. ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కీల్‌లో వినిపిస్తోంది.ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఏ సినిమా కూడా చూడని విధంగా ఉండబోతుందని.అంతే కాకుండా ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు వచ్చిన రాబోయే సినిమాలు ఈ సినిమా యాక్షన్ రేంజ్ ను అందుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నారు మేకర్స్. దీంతో ఈ సాహో ప్రభాస్ కెరీర్‌లోనే మరో మైల్ స్టోన్ చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు రెబల్ స్టార్స్ ఫ్యాన్స్.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *