ఆ మూవీ రికార్డ్స్ టచ్ చేయలేకపోతున్న సూపర్ స్టార్

ఆ మూవీ రికార్డ్స్ టచ్ చేయలేకపోతున్న సూపర్ స్టార్

తన 25వ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులని దుమ్ము దులపాలని చూస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ఒక మూవీకి రికార్డు పెద్ద గండంగా మారి, మహేశ్ బాక్సాఫీస్ స్టామినాకే సవాల్ విసురుతోంది. మరి మహేశ్ కి సవాల్ విసురుతున్న ఆ మూవీ ఏది? అందులో నటించిన హీరో ఎవరో తెలుసుకోవాలని ఉందా అయితే వాచ్ దిస్ స్టోరీ.

మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి సినిమా మొదటి షో నుండి మంచి టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కలక్షన్స్ పెద్దగా లేకున్నా ఓవరాల్ గా 1 మిలియన్ మార్క్ దాటేసింది. ఇక 5 రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో 50 కోట్లు షేర్ దాటిన మహర్షి, మహేష్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. అయితే మహేష్ నాన్ బాహుబలి రికార్డులను తన పేరున రాసుకునే వీలుందా అన్నది ఇప్పుడు అందరి డౌట్. మహర్షి సినిమా నాన్ బాహుబలి రికార్డులంటే అంతకన్నా ముందున్న రంగస్థలం రికార్డులను కొల్లగొట్టాల్సి ఉంటుంది. రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగథలం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించిన రంగస్థలం సినిమా 200కోట్లు రాబట్టి, బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టించింది.

మహర్షి సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టాలంటే రంగస్థలంని బీట్ చేయాలి. సూపర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినాకే ఇది అతిపెద్ద సవాల్ గా మారింది. మహేశ్ 25వ సినిమా, పైగా పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది… మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టింది… సో మహర్షి సినిమా కచ్చితంగా మహేష్ స్టామినా చూపించేలా సినిమా వసూళ్ల సునామి సృష్టించాల్సిందే. అయితే ఏరియా వైజ్ డే టూ డే డ్రాప్ అవుతున్న కలెక్షన్స్ చూస్తుంటే మహర్షి సినిమా రంగస్థలం రికార్డ్స్ ని బీట్ చేయడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. ఏదైనా మ్యాజిక్ జరిగి, మహర్షి సినిమా రంగస్థలం రికార్డ్స్ ని బ్రేక్ చేస్తే మహేశ్ నిజంగానే బాక్సాఫీస్ బాద్షా అయిపోతాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *