భారతీయ జనతా పార్టీ మరో సీనియర్ నేతకు బై చెప్పనుందా?

భారతీయ జనతా పార్టీ మరో సీనియర్ నేతకు బై చెప్పనుందా?

యడ్యూరప్పు…కర్ణాటక బీజేపీ నేతల్లో అగ్రజుడు. ఉత్తర కర్ణాటకకు చెందిన యడ్యూరప్ప తన కులబలంతో బీజేపీని తక్కువ కాలంలోనే రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చాడు. అంత వ్యూహకర్త కానప్పటికీ…కర్ణాటక రాజకీయాల్లో తనముద్ర వేసుకున్నారు. 75 ఏళ్లు నిండిన వారందరినీ బీజేపీ ఇంటికి పంపాలని అనుకుంటుంది. అందులో భాగంగా యడ్యూరప్పను సాగనంపుతారనే టాక్‌ గట్టిగానే వినిపిస్తుంది. కర్ణాటక బీజేపీ చీఫ్‌గా మరొకరిని సెలక్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది.

యడ్యూరప్పను తొలగించడం నిర్ణయం తీసుకున్నంత తేలిక కాదు. కర్ణాటకలో లింగాయత్ అనే బలమైన సామాజిక వర్గానికి బలమైన నాయకుడు. యడ్యూరప్పను చూసే లింగాయత్ లు అక్కడ బీజేపీకి సపోర్టర్స్ గా మారారు. వాళ్ల వాళ్లు సాలిడ్ గా బీజేపీకే పడుతూఉన్నాయి. వెంకయ్య నాయుడిని అంటే..అనుకున్నదే తడువుగా ఉప రాష్ట్రపతి పేరుతో తొలగించగలిగారు. వెంకయ్యకు ఏపీలో బలమైన సామాజిక వర్గం ఉన్నప్పటికీ..పార్టీ బలంగా ఉండకపోవడం…మోదీ – అమిత్ షాల నిర్ణయానికి తిరుగులేకుండా పోయింది. యడ్యూరప్ప విషయంలో మాత్రం మోదీ – అమిత్ షాలు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

యడ్యూరప్ప బీజేపీని వీడి బయటకు వెళ్లినప్పుడే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో యడ్యూరప్పను పక్కన పెట్టడానికి కమలం పార్టీ సాహసిస్తుందా? అనేది సందేహమే! యడ్యూరప్పకేమో ఇంకా రాజకీయం మీద చాలా ఆశలున్నాయి. మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే లెక్కలతో ఉన్నారాయన. అందుకే..అప్పుడప్పుడు కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలుకుతుంటారు. తాజాగా కూడా 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే కామెంట్ కూడా చేశాడు. ఈ తరహా కామెంట్స్‌ చేయడం యడ్యూరప్పకే చెల్లుద్ది.

లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు కాగానే కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం పడిపోతుందని.. బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తనే మళ్లీ సీఎం అనే లెక్కలతో ఉన్నారు యడ్యూరప్ప. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు బీజేపీ అధిష్టానం రిటైర్మెంట్ ను ఇవ్వగలదా? అనేది సందేహమే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *