స్నేక్ లెగిన్స్‌లో భార్య.. పామనుకుని భర్త బాదుడు

స్నేక్ లెగిన్స్‌లో భార్య.. పామనుకుని భర్త బాదుడు

ఆడవాళ్లు ఫ్యాషన్ పేరు చెప్పి రకరకాల దుస్తులు ధరిస్తుంటారు. వెరైటీ కోసం వింత డ్రెస్సులను వేసుకుని ఆనందపడుతుంటారు. అలా సరదా పడి వెరైటీ డ్రెస్ వేసుకున్న ఓ మహిళ…కాలు విరగ్గొట్టుకుంది. అది కూడా భర్త చేతుల్లో…ఇది మరింత వింతగా ఉంది కదా!

బేస్‌బాల్ బ్యాట్‌తో…

ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లో ఈ ఘటన్ జరిగింది. కొత్తగా ఉంది కదా అనీ…ఓ మహిళ పాము ఆకారంలో ఉండే లెగ్గిన్స్ తీసుకుంది. భర్తను ఆటపట్టించడానికి రాత్రి పడుకునే ముందు వాటిని వేసుకుని నిద్రపోయింది. బెడ్‌రూంలోకి వెళ్లిన ఆమె భర్త…ఆమె కాళ్లను చూసి పాములు అనుకుని కంగారుపడ్డాడు. శబ్దం చేయకుండా వెళ్లి బేస్‌బాల్ బ్యాట్ తెచ్చి ఆమె కాళ్లమీద కొట్టాడు. దెబ్బకు అరుస్తూ ఆమె లేచింది. పాముని చూసి భయపడిందనుకున్న భర్త ఇంకో నాలుగు దెబ్బలు ఎక్కువ వేశాడు. “అవి పాములు కావు నా కాళ్లు ” అని గట్టిగా కేకలు పెట్టింది. ఆమె భర్త లైట్లు వేసి అసలు విషయం తెలుసుకున్నాడు.  అయితే, అతను కొట్టిన దెబ్బలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు కాలు ఫ్యాక్చర్ అయిందని తేల్చేశారు.

ఆమె సరదాగా చేసిన పనికి ఏమనాలో తెలీక భర్త అయోమయంలో పడిపోయాడు. ఇది కాస్త సోషల్ మీడియా నెటిజన్లకు తెలియడంతో…భార్య కొట్టిన అదృష్టవంతుడంటూ సరదా కామెంట్లు పెడుతూ…ఈ ఘటనను వైరల్ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *