పొట్లకాయ, గుడ్డు కలిస్తే డేంజర్!

పొట్లకాయ, గుడ్డు కలిస్తే డేంజర్!
మనిషి జీర్ణాశయం అన్ని ఆహారపదార్థాలకు ఒకేలా పనిచేయదు. కొన్ని రకాల పదార్థాలను కరిగించడానికి తక్కువ సమయం పడుతుంది. మరికొన్ని పదార్థాలను కరిగించడానికి ఎక్కువ సమయం పడుతుంది. మనం తినే ఆహారాన్ని బట్టీ… మన జీర్ణాశయంలో కొన్ని రకాలైన ద్రవాలు, యాసిడ్‌లూ విడుదల అవుతాయి. తిన్న ఆహారం వెంటనే జీర్ణం అయ్యేసమయాన్ని బట్టీ అందుకు తగిన ఆమ్లాలు జీర్ణాశయంలో విడుదల అవుతాయి.

ఎసిడిటీ బాబోయ్ !

అయితే చాలా సందర్భాల్లో మనం రకరకాల ఆహార పదార్థాల్ని కలిపేసి తింటుంటాం. అన్నం, కూర కలిపి తిన్నప్పుడు ఎలాంటి యాసిడ్లు విడుదల చెయ్యాలన్నదానిపై జీర్ణాశయంలో కొంత సందిగ్ధత ఉంటుంది. కాంబినేషన్‌తో తినే ఆహార పదార్థాలు… అన్నీ దాదాపు ఒకే సమయంలో జీర్ణం అయ్యేవి అయితే ఏ సమస్యా రాదు… అదే కొన్ని రకాల పదార్థాలు త్వరగా జీర్ణం అయ్యేవి, కొన్ని ఎక్కువ సమయం పట్టేవి అయితే  సమస్య వస్తుంది. రిలీజైన యాసిడ్లు ఆహారంతో సరిగా పొసగక… ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.
 
కోడిగుడ్డు, పొట్లకాయను కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవు. ఎందుకంటే… పొట్లకాయ చాలా వేగంగా అరిగిపోయే ఆహార పదార్థం. అందువల్ల పొట్లకాయ జీర్ణాశయంలోకి వెళ్లగానే అక్కడ విడుదలయ్యే యాసిడ్లతో కలిసిపోయి… త్వరగా కరిగిపోయి, అరిగిపోతుంది. అందుకు తగిన యాసిడ్‌లను జీర్ణాశయం విడుదల చేస్తుంది.
 
కోడిగుడ్డు మాత్రం అలా కాదు. గుడ్డులో నీటి శాతం తక్కువగా ఉంతుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గుడ్డు వెంటనే అరగదు. దీన్ని అరిగించేందుకు ప్రత్యేక యాసిడ్‌లను విడుదల చేయాల్సి ఉంటుంది. అవి ఎక్కువ సేపు పనిచేసి గుడ్డును కరిగేలా చేస్తాయి. అంటే పొట్లకాయ, గుడ్డూ రెండింటికీ ఒకే రకమైన యాసిడ్‌లు పనిచేయవు. వేరువేరు యాసిడ్లను రిలీజ్ చెయ్యాల్సిందే. రెండింటినీ కలిపి తినడం వల్ల… గ్యాస్, కడుపులో మంట, ఎసీడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెప్తున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *