ప్రే ఫర్ నెసామణి...సోషల్ మీడియాలో ఇదే పాపులర్ హ్యాష్‌ట్యాగ్

ప్రే ఫర్ నెసామణి...సోషల్ మీడియాలో ఇదే పాపులర్ హ్యాష్‌ట్యాగ్

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పాపులర్ అయిన హ్యాష్‌ట్యాగ్ ఏదో తెలుసా? ఏ మిలినియర్ పేరో, సినితారల పేరో, నాయకుల పేరో అనుకునేరు. కానే కాదు..! ప్రే ఫర్ నెసామణి అనే పేరు ఇపుడు అత్యంత పాపులర్ హ్యాష్‌ట్యాగ్. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పదం ఇదే. పాకిస్తాన్‌కు చెందిన ఒక ఫేస్‌బుక్ పేజీ సుత్తి ఫోటోను పోస్ట్ చేసి మీ దేశంలో ఈ వస్తువుని ఏమంటారని ప్రశ్న అడిగింది. దీన్ని సరదాగా తీసుకున్న ఒక తమిళ నెటిజన్ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది.

పాకిస్థాన్‌కు చెందిన ఒక ఫేస్‌బుక్‌ పేజీలో ‘ఈ పరికరాన్ని మీ దేశంలో ఏమంటారు?’ అని చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాను కుదిపేసింది. తమిళ నటుడు వడివేలుకి సంబంధించిన ప్రే ఫర్ నెసామణి, నెసామణి హ్యాష్‌ట్యాగ్ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇంతకూ ఆ పరికరం ఏంటి..? వడివేలుకి ఆ సుత్తికి సంబంధమేంటి? ఇది అంతగా ట్రెండ్ అవడానికి కారణమేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? పాకిస్థాన్‌కు చెందిన సివిల్ ఇంజినీరింగ్ లెర్నర్స్ అనే ఫేస్‌బుక్ పేజీ.. సుత్తి ఫొటోను పోస్ట్ చేసి.. దీన్ని మీ దేశంలో ఏమంటారని అడిగింది.దీనికి స్పందించిన విగేష్ ప్రభాకర్ అనే తమిళవ్యక్తి.. ‘దీన్ని సుతియాల్ అంటారు. దీంతో దేన్నయినా మోదితే టంగ్ టంగ్ మని సౌండ్ వస్తుంది. తన మేనల్లుడి వల్ల పెయింటింగ్ కాంట్రాక్టర్ నెసామణి తల ఇలాంటి సుత్తి వల్లే పగిలింది. పాపం’ అని కామెంట్ ఇచ్చాడు. ఇదే చిత్రం…ఇదే చిత్రం…నాగార్జున, సుమంత్ హీరోలుగా ‘స్నేహమంటే ఇదేరా’ పేరుతో తెలుగులో కూడా వచ్చింది. ఇందులో వడివేలు పాత్రను బ్రహ్మానందం పోషించారు. నిజానికి అసలు విషయం ఏంటంటే.. కాంట్రాక్టర్ నెసామణి అనేది తమిళ చిత్రం ‘ఫ్రెండ్స్’లో వడివేలు పోషించిన పాత్ర పేరు. ఇందులో వడివేలు పెయింటింగ్ కాంట్రాక్టర్‌ నెసామణి పాత్రలో నటించాడు. ఒక సన్నివేశంలో వడివేలు అసిస్టెంట్..పై అంతస్థు నుంచి సుత్తిని పడేయడంతో అది అతని తలపై పడుతుంది.

ఈ కామెంట్ నిజమేనని నమ్మిన ఒక నెటిజన్.. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడా? అని రిప్లయ్ ఇచ్చారు. దీనికి విగేష్ ఫన్నీగా స్పందిస్తూ.. అతనిప్పుడు బాగానే ఉన్నాడు. వెంటనే అతనికి చికిత్స కూడా చేశారు’ అన్నాడు. అసలు విషయం తెలియని ఆ అమాయక నెటిజన్.. నెసామణి కోసం ప్రార్థిసానని బదులిచ్చాడు. తర్వాత విగేష్ ప్రభాకర్ #ఫ్రయ్_ఫొర్_నెసమని అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాడు.. అది ట్రెండ్ అయ్యింది. ఎంతలా అంటే ప్రపంచంలోనే ఈ హ్యాష్ ట్యాగ్ నంబర్ వన్‌గా నిలిచేంతగా..!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *