వాట్సాప్ సరికొత్త ఫీచర్

వాట్సాప్ సరికొత్త ఫీచర్

మెసేజింగ్ యాప్‌లలో అత్యంత ఆదరణ ఉన్నది వాట్సాప్. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ యాప్…మరో కొత్త ఫీచర్‌తో వచ్చేసింది. వాట్సాప్‌లో స్టేటస్ ఫీచర్‌ని చాలా మంది వాడుకుంటున్నారు. ప్రతీ గంట గంటకు తమ ఫీలింగ్స్‌ని ఫ్రేండ్స్‌కి తెలియజేసేలా స్టేటస్‌లు పెట్టుకుంటూ ఉంటారు. వాట్సాప్ ఇచ్చిన బెస్ట్ ఫీఅచర్స్‌లో ఇది కూడా ఒకటి.

ఈ ఫీచర్‌ని ఎంత బాగా వాడుకుంటున్నా…ఇందులో కొన్ని సమస్యలు ఉండటం కొంత ఇబ్బందే..! స్టేటస్‌లో డాట్ సింబల్ కనబడగానే ఎవరు స్టేటస్ పెట్టారా? ఏలాంటిది పెట్టారా అని ఆతృతగా చూసేస్తాం. ఇందులో కొందరివి నచ్చచ్చు..నచ్చకపోవచ్చు. నచ్చకపోతే..వారిని మ్యూట్ చేసుకునే అవకాశం ఉంది కానీ…లిస్ట్‌లో మాత్రం వారి స్టేటస్‌లు కనిపిస్తూనే ఉంటాయి. దీని ఆధారంగానే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. ఇకముందు నచ్చని వారి స్టేటస్‌ను చూడాల్సిన అవసరంలేదు. ఎవరిదైనా స్టేటస్ నచ్చకపోతే లిస్ట్‌లో కనిపించకుండా చేయవచ్చు..అలాంటి స్టేటస్‌ను శాశ్వతంగా కూడా హైడ్ చేసే ఫీచర్‌ని వాట్సాప్ ఇవ్వనుద్ని.

సరికొత్త వర్షన్ 2.19.183 ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో ఇప్పటికే హైడ్ స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఫీచర్ పరీక్షించిన తర్వాత మిగతా యూజర్లకు అందివ్వాలనేది వాట్సప్ ఆలోచన. హైడ్ స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందంటే మీకు ఎవరి స్టేటస్‌లు నచ్చట్లేదో వారి స్టేటస్ హైడ్ చేసె వీలుంటుంది. ఆ తర్వాత మళ్లీ కావాలంటే ‘షో’ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్లీ వారి స్టేటస్‌లు కనిపిస్తాయి. కాబట్టి… ఇక స్టేటస్‌లతో ఇబ్బంది పడాల్సి అవసరం ఉండదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *