వాట్సాప్ అదిరిపోయే ఫీచర్స్!

వాట్సాప్ అదిరిపోయే ఫీచర్స్!

వాట్సాప్ ఎప్పటికపుడు కొత్త కొత్త ఆప్షన్స్‌ను ఇస్తూ…వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. రకరకాల కొత్త ఫీచర్స్‌తో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. ఇపుడు మళ్లీ కొన్ని కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది వాట్సాప్. స్క్రీన్ షాట్ బ్లాక్ చేసుకోవడం, స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడం, డూడుల్ యూఐ లాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని తీసుకురానుంది. కాకపోతె ఈ ఫీచర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ముందు ముందుగా బీటాలో పరిశీలిస్తున్నారు. ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్ది పూర్తీ స్థాయిలో అందరికీ అందుబాటులో తీసుకువస్తారు. త్వరలో వాట్సాప్ తీసుకురానున్న కొత్త ఫీచర్ల ప్రత్యేకతలేంటో, వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం..!

ఛాట్స్ స్క్రీన్ షాట్స్ బ్లాక్: ఈ ఫీచర్‌తో వాట్సప్ చాట్‌లో స్క్రీన్ షాట్ తీసుకోవడం సాధ్యం కాదు. మీరు ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే స్క్రీన్ షాట్ పనిచేస్తుంది. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం కుదరదు.

ఫేస్‌బుక్‌లో స్టేటస్ షేరింగ్: వాట్సప్‌లో స్టేటస్ పెట్టడం అందరికీ అలవాటు. త్వరలో ఆ స్టేటస్‌ని నేరుగా ఫేస్‌బుక్‌లో షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

వాట్సప్ డూడుల్ యూఐ: యూజర్ల కోసం డూడుల్ యూఐ రూపొందిస్తోంది వాట్సప్. ప్రస్తుతం స్టిక్కర్స్, ఎమోజీస్‌కు వేరువేరు ట్యాబ్స్ ఉన్నాయి. ఇకపై ఇవన్నీ ఒకే గ్రూప్‌లో కనిపిస్తాయి.

ఇగ్నోర్ ఆర్కైవ్‌డ్ ఛాట్స్: ఏదైనా ఛాట్్‌ని హైడ్ చేస్తే ఆర్కైవ్‌లోకి వెళ్తుంది. ఆ ఛాట్‌లో కొత్త మెసేజ్ వచ్చినా కనిపించదు. అది ఆర్కైవ్‌లో ఉంటుంది.

యానిమేటెడ్ స్టిక్కర్స్: ఇప్పటి వరకు వాట్సప్‌లో మామూలు స్టిక్కర్‌లు ఉన్నాయి. వీటి స్థానంలో త్వరలో యానిమేటెడ్ స్టిక్కర్స్ రానున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *