అద్భుతమైన ఫీచర్ తెచ్చిన వాట్సాప్!

అద్భుతమైన ఫీచర్ తెచ్చిన వాట్సాప్!

ఎప్పటికపుడు కొత్త కొత్త అప్‌డేట్లతో వాట్సాప్ తమ వినియోగదారులను ఖుషీ ఖుషీ చేస్తోంది. సాధారణంగా ఇతర యాప్‌లలో ఏదైనా వీడియో చూస్తున్నపుడు వాట్సాప్‌లో మెసేజ్ వస్తుంది. వీడియోను పాజ్ చేసి…వాట్సాప్ ఓపెన్ చేసుకుని రిప్లై ఇవాల్సి ఉంటుంది. మళ్లీ ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇది కొన్నిసార్లు చికాకు పెడుతుంది కూడా…ఐఫోన్ యూజర్లకైతే ఈ పరిస్థితి ఉండదు. వారు వీడియోలను చూస్తూనే…వాట్సాప్ చాట్ చేయవచ్చు. కానీ ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సౌకర్యం లేదు. అలా అని అందరూ ఐఫోన్‌లు కొనలేరు. అయితే ఇకనుంచి ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇలాంటి వెసులుబాటును వాట్సాప్ తీసుకొచ్చింది.

Whats App New Version

ఆండ్రాయిడ్ యూజర్లకు వీడియో చూస్తున్నపుడు వాట్సాప్ మెసేజ్ చూసుకోవడానికి వీలుగా ‘పిక్చర్ ఇన్ పిక్చఋ అనే పేరుతో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను పాజ్ చేయకుండా వాట్సాప్ చాట్ చేసుకునే ప్రత్యేక విండో ఉంటుంది. దీంతో వేరేవాళ్లతో చాట్ చేస్తూనే థర్డ్ పార్టీ యాప్ అయినటువంటి యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలను వాట్సాప్‌లోనే ప్లే చేసి చూసుకోవచ్చు. అయితే…ఈ ఆప్షన్ కావాలంటే వాట్సాప్ 2.18.380 వర్షన్ ఉంటేనే వస్తుంది. ఈ వర్షన్‌కి అప్‌డేట్ చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. గ్రూప్ చాట్, సింగిల్ చాట్‌లను కూడా ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *