వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్

చాలామంది చాటింగ్ చేస్తున్నపుడు మెసేజ్‌తో పాటు వారి ఎమోషన్ తెలియడానికి స్టిక్కర్లను పంపిస్తుంటారు. రకరకాల స్టిక్కర్లతో మెసేజ్‌లు చేసుకోవడం అందరికీ అలవాటైన విషయమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేసేజింగ్ సంస్థ వాట్సాప్, కొత్త ఫీచర్‌గా స్టిక్కర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇంతకుముందే వాడుతున్నారు. ఇపుడు మరో అద్భుత ఫీచర్‌ని తెచ్చింది. స్టిక్కర్లను విపరీతంగా వాడుతున్నారని దీనికి మరింత ఆదరణ పెరగాలని ఫోటోలను కూడా స్టిక్కర్ల రూపంలో పంపించుకునే కొత్త ఫీచర్‌ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా ఎలాంటి ఫోటోలనైనా స్టిక్కర్లు మార్చి వాట్సాప్‌లో పంపించవచ్చు. తొందరలో దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వాట్సాప్ సంస్థ తెలిపింది.

 

Whats App Stickers

ఎలా చేయాలి..!

ఫీచర్‌ ఉపయోగించడం చాలా సులభం… ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌ ఎరేసర్‌ యాప్‌ లేదా స్టిక్కర్‌ మేకర్‌ ఫర్‌ వాట్సాప్‌ యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.


– బ్యాక్‌గ్రౌండ్‌ ఎరేసర్‌ యాప్‌ నుంచి స్టిక్కర్‌గా మార్చాలనుకున్న ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోటోలోని బ్యాక్‌ గ్రౌండ్‌్‌ని తీసేయాలి. దీన్ని PNG ఫార్మాట్‌లో సేవ్‌ చేసుకోవాలి. ఈ పద్ధతిని స్టిక్కర్‌ మేకర్‌ ఫర్‌ వాట్సప్‌ యాప్‌లో కూడా చేసుకోవచ్చు.
– ఇప్పుడు స్టిక్కర్‌ మేకర్‌ ఫర్‌ వాట్సాప్‌ యాప్‌ను ఒపెన్ చేసి అందులో కొత్త స్టిక్కర్‌ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. స్టిక్కర్‌ ప్యాక్‌ పేరు, తయారు చేసిన వారిపేరు ఎంటర్‌ చేసిన తర్వాత అందులో ఇంతకుముందు PNG ఫార్మాట్‌లో చేసిన స్టిక్కర్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే ఆప్సన్స్‌తో కనీసం మూడు స్టిక్కర్లను కలిపి ఒక ప్యాక్‌ తయారు చేయచ్చు. చివరగా ‘యాడ్‌ టు వాట్సాప్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పూర్తయ్యాక ఈ స్టిక్కర్లు వాట్సాప్‌ ద్వారా ఎవరికైనా పంపుకోవచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *