మే 23కు వైఎస్‌ఆర్‌ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటీ?

మే 23కు వైఎస్‌ఆర్‌ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటీ?

మే 23 అంటే వైఎస్‌ఆర్‌ కుటుంబానికి ఎందుకు షాక్‌. మే 23న ఆ కుటుంబం ఎందుకు బాధలోకి వెళ్లిపోతుంది. మే 23కు వైఎస్‌ఆర్‌ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటీ?. ఆ తేదీ చెప్పగానే వైఎస్ఆర్‌ కుటుంబం ఎందుకు ఉలిక్కి పడుతుంది.?. మే 23న రిజల్ట్స్‌ ఉన్నాయనా? ఇంకా ఏమైనా ఉందా?

తెలుగు రాష్ట్రాలే కాదు.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా దేశం యావత్తు మే 23 కోసమే ఎదురుచూస్తోంది. ఆరోజే ఎన్నికల ఫలితాలు. ఏపీలో అదే రోజు లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాలు వెల్లడవుతాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఊపిరి బిగబట్టి ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు..భారీ స్థాయిలో బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వం ఎవరిదన్న ఉత్కంఠ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇక కేంద్రంలో ఎవరు ప్రధాని అవుతారు అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.

మరీ..మే23 అంటే వైఎస్‌ఆర్‌ కుటుంబం ఎందుకు విషాదంలోకి వెళ్తుంది. ఆ కుటుంబంలో అదే రోజు విషాదం జరిగింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాతా రాజారెడ్డి ఈరోజే హత్యకు గురైయ్యారు. ఆయన ప్రత్యర్థులు రాజారెడ్డిని బాంబులతో దాడి చేసి వేటకోడవళ్లతో దారుణంగా చంపిన రోజు.అందుకే..మే23న వైఎస్‌ఆర్‌ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

కడప జిల్లాలో తిరుగులేని రాజకీయ నాయకుడు వైఎస్ రాజారెడ్డి . ఆయన ఆదిపత్యాన్ని తగ్గించడానికి ఆయనకు వ్యతిరేకంగా అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు శతవిధాలా ప్రయత్నించింది. 1998 మే 23వ తేదీన ఇడుపుల పాయలో భారీ వర్షం కురిసింది. దీంతో ఇడుపుల పాయలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడానికి వైఎస్ రాజారెడ్డి అనుచరులతో కలిసి జీపుల్లో వెళ్లారు. తిరిగి వస్తుండగా.. వేముల మండలం సమీపంలోని ఓ కల్వర్ట్ వద్ద వరద నీరు పోటెత్తడంతో జీపు ఆగింది. దీంతో అక్కడే కాపుకాసిన టీడీపీ నాయకుడు పార్థసారథిరెడ్డి ఆయన సోదరుడు ఉమామహేశ్వర్ రెడ్డి లు అనుచరులతో కలిసి రాజారెడ్డి జీపుపై బాంబులు వేశారు. ఆయన గాయపడ్డాక వేటకోడవళ్లతో నరికి చంపారు. రాజారెడ్డి అనుచరుల దాడిలో ప్రత్యర్థి ఉమామహేశ్వర్ రెడ్డి చనిపోయాడు.

ఇలా రాజారెడ్డి మరణించిన రోజు.. ఎన్నికల ఫలితాల రోజు ఒకటే కావడం యాధృశ్చికం. అయినా వైసీపీకి జగన్ కు ఇది గుర్తుండిపోయే రోజు అయ్యేలానే ఉంది. సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉండడంతో విజయంతో తాతా రాజారెడ్డికి నివాళులర్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *