మహేశ్ ఆనందానికి కారణం ఏంటి?

మహేశ్ ఆనందానికి కారణం ఏంటి?

తన 25వ సినిమా హిట్ అవడంతో మహేశ్ బాబు… ఘట్టమనేని అభిమానుల కన్నా ఎక్కువ ఆనందపడుతున్నాడు. రీసెంట్ గా జరిగిన మహర్షి సక్సస్ మీట్ లో అయితే ఏకంగా కాలర్ ఎత్తి మరీ మాట్లాడాడు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మహేశ్, ఇలా చేయడం ఏంటి? మహేశ్ ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నాడు అంటూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా సక్సస్ మీట్‌లో మహేష్ మాట్లాడిన తీరు… ఆయన ప్రవర్తనా అందరికీ కొత్త మహేశ్ చూపించాయి. మహర్షి ప్రయాణం ఎంతో ప్రత్యేకమని… ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే వంశీ పైడిపల్లి… ఈ సినిమా చూసిన తర్వాత ఘట్టమనేని అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారని చెప్పాడు… అభిమానులే కాదు ఇప్పుడు నేను కూడా కాలర్ ఎత్తుకుంటున్నాను అని చెప్పిన మహేశ్ కాలర్ ఎత్తి మాట్లాడాడు. మహర్షి విషయంలో అసలు మహేశ్ ఇంత ఎగ్జైట్ ఎందుకు అవుతున్నాడో ఎవరికీ అర్ధం కావట్లేదు… మహేష్, వంశీ పైడిపల్లి కన్నా గొప్ప దర్శకులతో పని చేశాడు, మహర్షి కన్నా హిట్ సినిమాలు ఇచ్చాడు. కానీ ముందెప్పుడూ లేనంతగా, ఇదే మొదటి విజయం అన్నట్లుగా మహేశ్ మాట్లాడడం చాలా కొత్తగా ఉంది. పైగా మహర్షి సినిమా అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతుందా అంటే అదీ లేదు. ఈ సినిమాకి ఫస్ట్ డే అయిదు ఆటలు వేసి, టికెట్ రేట్లు పెంచితే… వచ్చింది 24.6కోట్లు.

నిజానికి మహర్షి సినిమాకి ముందు చేసిన హడావుడి చాలా తక్కువ, ఓవర్సీస్ లో మహర్షి పరిస్థితి మరీ దారుణంగా ఉంది… మూడు రోజులకి 1మిలియన్ క్లబ్ లో చేరిన ఈ మూవీ లాంగ్ రన్ లో 2.5 మిలియన్ టచ్ చేస్తే గొప్పే అనే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మహర్షి అద్భుతాలేమి చెయ్యట్లేదు, దిల్ రాజు చేతిలో ఉన్న నైజాం ఏరియాలో మాత్రమే మహర్షి మంచి వసూళ్లు రాబడుతోంది… రోజురోజుకి కలెక్షన్స్ తగ్గుతున్నా కూడా… మహర్షి చాలా పెద్ద విజయం సాధించింది అంటూ ఒక సూపర్ స్టార్ హోదా ఉన్న వ్యక్తి మాట్లాడడం… కాలర్ ఎత్తి స్పీచ్లు ఇవ్వడం… ఏంటి? అసలు మహేశ్ ఇలా ఎందుకు ప్రవర్తించాడు? ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మహేశ్, కేవలం కెరీర్ బెస్ట్ సినిమాకే ఇంత ఎగ్జైట్ అవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికీ అంతుబట్టని విషయంగా మిగిలింది. వీకెండ్ అయిపొయింది, కలెక్షన్ల ఫ్లో తగ్గుతుందనే విషయం గురించి మహేశ్ అసలు ఆలోచించినట్లు లేదు. ఇప్పటి నుంచి వర్కింగ్ డేస్ మొదలవుతాయి కాబట్టి మహర్షికి అసలు పరీక్ష ఎదురవుతోంది… అది తట్టుకోని నిలబడి, ఎవరికీ నష్టాలు తెచ్చిపెట్టకుండా సేఫ్ జోన్ వస్తేనే మహర్షి హిట్ అయినట్లు. కలెక్షన్స్ లో ఏ మాత్రం భారీ డ్రాప్ కనిపించినా, ఫుల్ రన్ లో సేఫ్ జోన్ లోకి రాకపోయినా… మహేశ్ బాబు తొందరపడి కాలర్ ఎత్తినట్లు అవుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *