జగన్ అధికారంలోకి వస్తే తీసుకోబోయే నిర్ణయం ఏంటి?

జగన్ అధికారంలోకి వస్తే తీసుకోబోయే నిర్ణయం ఏంటి?

ఏపీలో అధికారం చేపట్టబోతున్నామని వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు. జగన్ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో ఈ నెల 23న చూడండి అంటున్నారు. ఇదిలా ఉంటే, వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారట. ఆయనతో పాటు ఆయన టీమ్ కూడా దాన్ని ఫాలో కాబోతున్నారట. ఇంతకీ, జగన్ అధికారంలోకి వస్తే… తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటి? ఇదే అంశంపై ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రం. విభజన తర్వాత అనేక కష్టాలు పడిన రాష్ట్రం. ఇవన్నీ టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చెబుతున్న మాటలు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు లోటు బడ్జెట్ అంటూనే…రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, దుబారా ఖర్చులు చేశారని జగన్, ఆ పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకున్నారు జగన్. ఇందుకు సంబంధించి ఓ కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఒక వైపు అప్పులు అంటూనే మరోవైపు దుబారా ఖర్చులు చేసిన చంద్రబాబుకి… తనకి మధ్య తేడా ఏంటో చూపించాలనుకుంటున్నారట జగన్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న వేళ.. తాను ముఖ్యమంత్రి అయితే కేవలం ఒక్క రూపాయి వేతనంతో పని చేయాలని అనుకుంటున్నారట జగన్.

జగన్ ఒక్క రూపాయి వేతనంపై ఇప్పటికే పార్టీలో చర్చ కూడా జరిగిందట. ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పినందున, ఆర్థిక క్రమశిక్షణ చేసి చూపించాలని జగన్ భావిస్తున్నారట. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలంటే…అది తన దగ్గర నుండే మొదలు కావాలని జగన్ అనుకుంటున్నారట. ప్రజలకు ఏదైనా చెప్పే ముందు ఆ పనిని మన నుండే మొదలు పెడితే ..ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని జగన్ ఆలోచనగా ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్‌తో పాటు మంత్రివర్గంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ విధానాన్నే ఫాలో అవుతారని చెబుతున్నారు.

జగన్ వన్ రూపీ సాలరీ కాన్సెప్ట్… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లోటు బడ్జెట్ అంశాల కారణంగా తీసుకున్న నిర్ణయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తీసుకునే నిర్ణయం చరిత్ర సృష్టిస్తుందని అంటున్నారు. జగన్ ఒక్క రూపాయి కాన్సెప్ట్‌ను గతంలో కూడా… కొంతమంది ముఖ్యమంత్రులు అమలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క రూపాయి జీతంతో పని చేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా ఒక్క రూపాయి వేతనంతో పని చేస్తున్నారు.

మొత్తానికి, జగన్ ఒక్క రూపాయి జీతం కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా..ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలి కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *