కీటో డైట్ అంటే ఏమిటి..? దాని వల్ల కలిగే అద్భుతమైన లాభాలు...అది ఎలా ప‌నిచేస్తుందో తెలుసా...!

కీటో డైట్ అంటే ఏమిటి..? దాని వల్ల కలిగే అద్భుతమైన లాభాలు...అది ఎలా ప‌నిచేస్తుందో తెలుసా...!

కీటోజెనిక్ డైట్..లో కార్బ్ డైట్..లో కార్బ్ హై ఫ్యాట్ డైట్..ఇలా పేరేదైనా ఈ డైట్ మాత్రం ఒక్కటే.నేటి తరుణంలో ఎక్కడ చూసినా ఈ హై ఫ్యాట్ డైట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తున్నది.అయితే అసలింతకీ కీటో డైట్ అంటే ఏమిటి..?దాంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ?అది ఎలా ప‌నిచేస్తుంది ?త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక మన శరీరాన్ని ఫ్యాట్ మెటబాలిజం వైపు మళ్లించేందుకు ఇదొక వ్యామోహం కోసం చేసే డైట్ చాలామంది కీటో డైట్ ను ‘ఫాడ్ డైట్ (వ్యామోహంకి పోయి చేసే క్రాష్ డైట్)’అనగా అది దీర్ఘకాలికంగా ఏ ప్రభావం చూపదని మరియు కేవలం అప్పటికప్పుడు ఫలితాలు మాత్రమే కన్పిస్తాయని భావిస్తారు.కానీ అనేక పరిశోధనలు,సర్వేల ప్రకారం కీటో డైట్ దీర్ఘకాలికంగా కూడా మంచి ప్రభావాన్నే చూపిస్తుందని,దానికి కావాల్సిన అన్ని అర్హతలన్నీ శాస్త్రీయంగా పరీక్షించబడ్డాయని తేలింది.ఉపయోగపడేదే కీటో డైట్.ఇందులో పూర్తిగా హై ఫ్యాట్ కలిగిన ఆహారాలు ఉంటాయి.

కోడిగుడ్లు,చికెన్,మటన్,చేపలు,రొయ్యలు,కిడ్నీ,లివర్,నెయ్యి,కొబ్బరినూనె, పన్నీర్,చీజ్,వెన్న,పాల మీద మీగడ తదితరాలు హై ఫ్యాట్ డైట్ కిందకు వస్తాయి.కనుకనే కీటో డైట్ పాటించే వారు కేవలం వీటినే ఆహారంగా తీసుకుంటారు.ఈ క్రమంలో ఈ ఆహారాల వల్ల శరీరం 1,2 రోజుల్లో ఫ్యాట్ మెటబాలిజం వైపు మళ్లుతుంది.అప్పుడు మన శరీరంలో ఉండే కొవ్వులను లివర్ కీటోన్లుగా మారుస్తుంది.అవి మనకు శక్తిని అందిస్తాయి.క‌నుక‌నే దీనికి కీటో డైట్ అని పేరు వ‌చ్చింది.కేవ‌లం కీటోన్ల‌నే శ‌రీరం శ‌క్తి కోసం తీసుకుంటుంది.కీటో డైట్ లాభాలు ఇవే…

1. కీటో డైట్ వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు.హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి.యాక్టివ్‌గా ఉంటారు.

2. మధుమేహం అదుపులోకి వస్తుంది.టైప్ 2 డయాబెటిస్ రివర్స్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది

3. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.జ్ఞాపకశక్తి,ఏకాగ్రత పెరుగుతాయి.అల్జీమర్స్ తగ్గుతుంది.

4. శరీర శక్తిస్థాయిలు పెరుగుతాయి.ఏ పని చేసినా అంత త్వరగా అలసిపోరు.బాడీ బిల్డింగ్ చేసే వారు ఎన్ని గంటలైనా వ్యాయామం చేయవచ్చు.దీంతో శరీరం త్వరగా చక్కని షేప్‌లోకి వస్తుంది.

5. బీపీ తగ్గుతుంది.రక్త సరఫరా మెరుగు పడుతుంది.కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

6. చర్మం కాంతివంతంగా మారుతుంది.గోళ్లు,వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.కీటోడైట్‌లో ఉన్నవారు తినాల్సినవి…

చేపలు,బీఫ్,మేక,గొర్రె మాంసం,చికెన్,ఎగ్స్,ఆకుపచ్చని కూరగాయలు,కాలిఫ్లవర్,చీజ్,క్రీం,వెన్న,నట్స్,అవకాడోలు,బ్లాక్ బెర్రీలు,రాస్ప్‌బెర్రీలు,స్టీవియా,కొబ్బరినూనె,ఆలివ్ ఆయిల్,నెయ్యి,పన్నీర్ తదితర ఆహారాలను కీటో డైట్‌లో ఉన్నవారు తినాలి.కార్బొహైడ్రేట్లను అస్సలు తీసుకోరాదు.లేదంటే ఆశించిన ఫలితం రాదు.

కీటోడైట్‌లో ఉన్నవారు తినకూడనివి…

గోధుమలు,మొక్కజొన్న,రైస్,తృణ ధాన్యాలు,చక్కెర,తేనె,యాపిల్స్,అరటి పండ్లు,ఆరెంజ్‌లుఆలుగడ్డలు,చిక్కుడు,బటానీ గింజలు తినరాదు.

కీటో డైట్ పై ఉన్న అపోహలు

అపోహ#1

ఇదొక వ్యామోహం కోసం చేసే డైట్ చాలామంది కీటో డైట్ ను ‘ఫాడ్ డైట్ (వ్యామోహంకి పోయి చేసే క్రాష్ డైట్)’అనగా అది దీర్ఘకాలికంగా ఏ ప్రభావం చూపదని మరియు కేవలం అప్పటికప్పుడు ఫలితాలు మాత్రమే కన్పిస్తాయని భావిస్తారు.కానీ అనేక పరిశోధనలు,సర్వేల ప్రకారం కీటో డైట్ దీర్ఘకాలికంగా కూడా మంచి ప్రభావాన్నే చూపిస్తుందని,దానికి కావాల్సిన అన్ని అర్హతలన్నీ శాస్త్రీయంగా పరీక్షించబడ్డాయని తేలింది.

అపోహ#2

దాన్ని పాటించడం చాలా కష్టం మీ రోజువారీ ఆహరంలోంచి చాలామటుకు కార్బొహైడ్రేట్లను తీసెయ్యాలి అంటే తెల్ల అన్నం,బ్రెడ్ వంటివి.ఇవి చాలామందికి ప్రధాన ఆహారం కాబట్టి ఇది పాటించడం చాలా కష్టంగా కన్పిస్తుంది.కానీ ఇతర డైట్లలాగానే,ఇది కూడా అలవాటవడానికి కొంత సమయం పడుతుంది,ఇక తర్వాత అంత కష్టంగా ఉండదు!

అపోహ#3

కేవలం నీటి బరువును తగ్గిస్తుంది కీటో డైట్లో కొవ్వు పదార్థాలను పూర్తిగా కట్ చేయం కాబట్టి,కేవలం కార్బొహైడ్రేట్లే పోతాయి కాబట్టి కొంతమంది ఇది బరువును ఏమీ తగ్గించదు,తాత్కాలికంగా నీటిబరువును మాత్రమే తగ్గిస్తుందని నమ్ముతారు.కానీ కీటో డైట్ శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తుందని నిరూపితమైంది!

అపోహ #4

గుండెకు మంచిది కాదు ఇది మరొక ప్రాచుర్యంలో ఉన్న అపోహ.చాలామంది కీటో డైట్ గుండె ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని భావిస్తారు.కానీ ఈ అపోహకి శాస్త్రీయపరంగా ఆధారం లేదు.నిజానికి అనారోగ్యకర కార్బొహైడ్రేట్లను తినటం మానేయటం వలన,చాలామంది న్యూట్రిషన్ నిపుణులు ఇది గుండెకు కూడా చాలా మంచిదని భావిస్తారు!

అపోహ#5

మీరు తక్కువ తింటేనే ఇది పనిచేస్తుంది రోజుకి కొన్ని కేలరీలను మాత్రమే తీసుకోగలిగే కొన్ని డైట్లలాగా కాకుండా,కీటో డైట్ పాటించేవారు వారి బిఎంఐ కి తగ్గట్టుగా క్రమం తప్పకుండా మామూలుగానే తినవచ్చు,కేవలం కార్బొహైడ్రేట్లు లేకుండా.అందుకని కీటో డైట్ ఎలా డిజైన్ చేయబడిందంటే మీరు ఆకలితో మాడకుండా ఉన్నా కూడా మీరు ఫలితాలు చూడవచ్చు!

అపోహ #6

దీనిలో ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి కీటో డైట్ పాటించేవారు అధిక కార్బొహైడ్రేట్లను తీసేయాలన్నారని,దాని స్థానంలో అధిక ప్రోటీన్,ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను జతచేయమన్నారని మీరు రోజుకి కావాల్సినంత ప్రొటీన్ పొందుతున్నారని అర్థం కాదు.అది మీ ఆహారంలో ఎంత ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకున్నారన్నదానిపై ఆధారపడి ఉంటుంది.చాలామంది అవసరమైనంత ప్రొటీన్ తీసుకోవాలని విస్మరించి పోషకలోపాలలో చిక్కుకుంటారు.

అపోహ #7

మెదడుకు ఆరోగ్యకరమైనదా ఇప్పుడు మనలో చాలామంది కీటోజెనిక్ డైట్ ఆరోగ్యకరమైనది అని ఒప్పుకుంటున్నాం,కదా?సరే ఇది ఇతర డైట్ లకంటే ఆరోగ్యకరమైనదైనా,దీని లోపాలు దీనికి కూడా ఉన్నాయి.మీ శరీరానికి సరిపోయినంత కార్బొహైడ్రేట్లు అందకపోవటం వలన,మీ మెదడు పనితీరు ప్రభావితమయ్యి,మెల్లగా తగ్గిపోతుంది.అంటే మీకు తాత్కాలికంగా అలసట,కళ్ళు తిరగటం,ఏకాగ్రత లేకపోవటం వంటివి జరగవచ్చు.

అపోహ#8

మీ వ్యాయామం చేసే శక్తి తగ్గిపోతుంది ముందు పాయింట్లో చెప్పినట్లు తక్కువ కార్బొహైడ్రేట్ల డైట్ కీటో,మీ మెదడు పనితీరును తగ్గించి తాత్కాలిక అలసటను కలిగిస్తుంది.కానీ మీరు సరైనంత ప్రొటీన్ మరియు ఖనిజలవణాలను మీ ఆహారం ద్వారా తీసుకుంటే,వ్యాయామం చేసేటప్పుడు కూడా ఏ సమస్యలు ఉండవు,ఎందుకంటే అనేక మంది వ్యాయామ నిపుణులు కూడా కీటో డైట్ యే అనుసరిస్తారు!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *