రియల్ హీరో : వెల్‌కమ్‌ బ్యాక్‌ అభినందన్‌

రియల్ హీరో : వెల్‌కమ్‌ బ్యాక్‌ అభినందన్‌

మొన్నటి నుంచి అభినందన్ భారతీయులు కొత్త హీరో అయ్యారు. హీరో ల్లేక, రాజకీయ నాయకుల్లో హీరోల్ని చూల్లేక అల్లాడిపోతున్న భారతీయ యువతకు ఒక హీరో దొరికాడు. అంతే, ఎవరీ అభినందన్ ఏమా కథ అంటూ ఇంటర్నెట్ లో విపరీతంగా వేదుకుతున్నారు. ఆయన పాకిస్తాన్ నుంచి సురక్షితంగా తిరిగి రావాలని కోరుతున్నారు. అయితే తోకముడిచిన పాక్‌.. మన హీరోను మన దేశానికి పంపనుంది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.

యుద్ధ విమానాన్ని ప్రత్యర్థులు కూల్చేసిన వేళ.. అందులో నుంచి క్షేమంగా బయట పడటం ఒక గుడ్ న్యూస్ అయితే.. ప్రత్యర్థి సేనలకు చిక్కటం నిజంగానే బ్యాడ్ న్యూస్. అయితే.. అలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా వ్యవహరించటం.. ఆత్మ నిబ్బరంతో ఉండటం అంత మామూలు విషయం కాదు. తాజాగా పాక్ సేనలకు చిక్కిన యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ ధైర్యానికి.. సాహసానికి సెల్యూట్ చేయాల్సిందే.

ఎందుకంటారా?. పాక్ ఆర్మీ అధికారులు నీ పేరు ఏమిటి? లాంటి సాదాసీదా ప్రశ్నలకు సమాధానం చెప్పారే కానీ.. మీరు ఎక్కడి వారు.. మీరు ప్రయాణిస్తున్న యుద్ధ విమానం పేరేమిటి? మీ మిషన్ పేరు ఏమిటి? లాంటి ప్రశ్నలకు.. సారీ.. నేనీ వివరాల్ని చెప్పలేనంటూ సూటిగా చెప్పేయటం మామూలు విషయం కాదు. ఇది జరగటానికి ముందు కొన్ని అల్లరి మూకల దాడికి గురి కావటం.. కళ్లకు గంతలు కట్టి.. చేతులు వెనక్కి విరిచి కట్టివేసి.. నిలబెట్టి ఇంటరాగేషన్ చేసిన సమయంలోనూ.. ఆ తర్వాత గాయాల్ని సరి చేసి.. టీ కప్పు చేతికి ఇచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నప్పటికీ.. తాను చెప్పాల్సిన జవాబులు మాత్రమే చెప్పారే తప్పించి.. చెప్పకూడని వాటి గురించి పెదవి విప్పలేదు.

Abhinandan My Hero

మరింత ధైర్యంగా.. శత్రు సైనలకు జవాబు చెప్పటానికి ధైర్యం.. ఆత్మస్థైర్యం ఎంత కావాలి? అదంతా తనలో చాలానే ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిన మన యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్దన్ కు సలాం చేయాల్సిందే. ఆయనకు.. ఆయన కుటుంబానికి దేశ జనులంతా అండగా ఉండాల్సిందే.

అయితే పాకిస్తాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను నేడు విడుదల చేస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్లమెంట్‌లో ప్రకటించడం పట్ల యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అభినందన్‌ విడుదల కానుండటంతో దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటూ, మిఠాయిలు పంచుకుంటున్నారు. అదేవిధంగా సోషల్‌ మీడియా వేదికగా సెలబ్రిటీలు, నెటిజన్లు వింగ్‌ కమాండర్‌ విడుదలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం భారత్‌లో వెల్‌కమ్‌ బ్యాక్‌ అభినందన్‌ (#welcome back Abhinandan) అనే హ్యాష్‌ ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *