వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండె జబ్బులకు చెక్

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండె జబ్బులకు చెక్

ఎప్పటికప్పుడు కొత్త కేస్‌స్టడీలు జరుగుతూనే ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన అనేక కొత్తకొత్త చిట్కాలు వస్తూనే ఉన్నాయి. వాకింగ్‌తో, సైక్లింగ్‌తో చాలా వరకు గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని, చాలా మంది డాక్టర్లే మనకి సలహా ఇస్తారు. కానీ ఈ సర్వే మాత్రం వాటికంటే మంచి ఉపాయాన్ని చెప్తానంటోంది. వెయిట్‌లిఫ్ట్‌ వల్ల గుండెకు చాలా ఉపయోగాలున్నాయని ఈ మధ్యనే చేసిన ఈ సర్వే చెప్తోంది. దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.

uses of weight lifting

4,086 మందిపై పరిశోధన…

గుండె జబ్బులకు కారణమయ్యే అనేకానేక అంశాల మీద పరిశోధనలు జరిపారు. 21 ఏళ్ల వయసుదాటిన 4,086 మందిపై ఈ సర్వే చేశారు. దీన్ని ఈ ఏడాది పెరూలో జరిగిన లాటిన్‌ అమెరికా కాన్ఫిరెన్స్‌లో ప్రదర్శించారు. గుండె జబ్బులకు దూరంగా ఉండేందుకు వెయిట్‌లిఫ్టింగ్‌ ఉత్తమ మార్గమని చెప్పారు. అప్పటికే గుండె జబ్బలతో బాధపడుతున్న వాళ్లు వెయిట్‌ లిఫ్టింగ్‌కి దూరంగా ఉండటమే మంచిదన్నారు. గుండె సమస్యలతో బాధ పడుతున్న వాళ్లంతా డాక్టర్ల సలహాలపై మాత్రమే వ్యాయామం చేయాలని సూచించారు.

యూత్‌కు వెయిట్‌ లిఫ్టింగే బెస్ట్‌…

వాకింగ్‌, సైక్లింగ్‌ కంటే వెయిట్‌ లిఫ్టింగ్‌ వల్లే గుండెకు ఎక్కువ ఉపయోగాలున్నాయని ఈ సర్వే చెప్పింది. అయితే పెద్ద వయసు వాళ్లకు మాత్రం వాకింగ్‌, సైక్లింగ్‌లే బెస్ట్ అని చెప్తోంది. యూత్‌కి మాత్రం అన్నివిధాలా వెయిట్‌ లిఫ్టింగే మంచిదని సలహా ఇస్తోంది. అలా అని వాకింగ్‌, సైక్లింగ్‌లను పక్కన పెట్టేయోద్దనీ… వాటితో పాటు దీన్నీ కొనసాగిస్తే మరిన్ని ఉపయోగాలుంటాయని చెప్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *