రణ్‌వీర్‌ ఇంట్లో దీపిక కుడి కాలు పెట్టేదెప్పుడు?

రణ్‌వీర్‌ ఇంట్లో దీపిక కుడి కాలు పెట్టేదెప్పుడు?

ఈ మధ్య బాలీవుడ్ లో ప్రేమ పెళ్లిలు బాగానే జరుగుతున్నాయి. తాజాగా మరో హ్యాండ్ సామ్ హీరో రణ్‌వీర్ సింగ్, డస్కీ బ్యూటీ దీపికా పదుకొనే త్వరలోనే ఒకటి కాబోతున్నారు. ఈ నవంబర్‌ నెలలో పెళ్లి చేసుకోవాలిని చూశారు. దాని కోసం ఏ వర్క్‌ కమిట్‌మెంట్స్‌ పెట్టుకోకుండా అన్ని పనులు కూడా స్టార్ట్ చేశారట. కానీ తాజాగా పెళ్లి ముహూర్తం ఓ రెండు నెలలు వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది.

Ranveer Deepika

ఏడాదికి పెళ్లి వాయిదా

అన్నింటికి అర్డర్ కూడా ఇచ్చారట. రణ్‌వీర్‌ తాను ఉంటున్న ఇంటికి కొత్త హంగులు దిద్దించారట. పెళ్లి తర్వాత ఈ జంట ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారని టాక్‌.పెళ్లికి వేదిక కూడా ఫిక్స్ చేశారు. లైప్ లో మార్చిపోలేని విధంగా స్వీట్ మెమోరిగా ఉండేలా ఇటలీలోని ఓ సముద్ర తీరాన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. కానీ ఇప్పుడప్పుడే మ్యారేజ్ అయ్యేలా లేదని తెలుస్తోంది.వచ్చే ఏడాదికి పెళ్లి వాయిదా పడిందని ముంబై వర్గాల సమాచారం. మరి ప్రేమ పక్షుల పెళ్లి ఎప్పుడు? రణ్‌వీర్‌ ఇంట్లో దీపిక కుడి కాలు పెట్టేదెప్పుడు? అనేది తెలియాలంటే వీర్‌దీప్‌లు క్లారీటి ఇవ్వాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *