చెన్నై నీటి కష్టాలు: రైల్లో 25 లక్షల లీటర్లు నీరు తరలింపు..

చెన్నై నీటి కష్టాలు: రైల్లో 25 లక్షల లీటర్లు నీరు తరలింపు..

తమిళనాడులో నీటికష్టాలకు ఇంకా తెరపడలేదు. కొంతలో కొంతైనా ఈ సమస్యకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ట్యాంకర్లలో నీటిని నింపి చెన్నై నగరానికి పంపింది. వేరే ప్రాంతాల నుంచి చెన్నైకి రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అందులో భాగంగా.. జోలార్‌ పెట్టాయ్ నుంచి చెన్నైకి 50వేల లీటర్ల నీటిని రైలు ద్వారా తరలించారు.

ఇప్పటికే చెన్నైలోని రిజర్వాయర్లు అడుగంటిపోవడం… అంతకంతకు పెరిగిపోతున్న నీటి కష్టాలతో అక్కడి పరిశ్రమలు కూడా ఉత్పత్తిని బంద్ చేశాయి. జోలార్ పేటై నుంచి 50 వ్యాగన్లలో నీటిని నింపుకుని ఉదయం 7:30 గంటలకు చెన్నైకి బయలుదేరింది. గురువారం ఉదయం నుంచే సిబ్బంది జోలార్ పేటై‌లో వ్యాగన్లను నీటితో నింపారు. మొత్తం 50 వ్యాగన్లలో ఒక్కో వ్యాగన్‌లో 50వేల లీటర్ల నీటిని నింపారు. ఈ నీటిని మరో నది నుంచి తీసుకున్నారు. ఈ రైలు శుక్రవారం చెన్నైకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ నీటిని ఓ కారు తయారీ సంస్థ వినియోగించుకోనుంది. ఇప్పటికే నీటి కొరతతో కొన్ని స్కూళ్లను మూసివేయడం జరిగింది.

చెన్నైని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాలు లేకపోవడం.. చెరువులు,కుంటలు ఎండిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వాయర్లలోనూ చుక్క నీరు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో
వేరే ప్రాంతాల నుంచి చెన్నైకి రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అందులో భాగంగా.. జోలార్‌ పెట్టాయ్ నుంచి చెన్నైకి 50వేల లీటర్ల నీటిని రైలు ద్వారా తరలించారు. చెన్నైలో నీటి కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. కొన్నిచోట్ల స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని చెప్పాయి. కొన్నిచోట్ల హోటల్స్ కూడా మూతపడ్డాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *