సియాచిన్‌లో మైనస్ టెంపరేచర్

సియాచిన్‌లో మైనస్ టెంపరేచర్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా ఖ్యాతిగాంచిన సియాచిన్‌లో వాతావరణం దారుణంగా ఉంది. వాతావరణం మైనస్ 60 డిగ్రీలకు చేరుకోవడంతో భారత సైనికుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆహార పదార్థాలు గడ్డకట్టుకుపోయి తినడానికి పనికిరాకుండా పోతున్నాయి. తాగానికి నీళ్లు కూడా కరవుతున్నాయి. పళ్ల రసాలు గడ్డకట్టుకుపోగా, గుడ్లు, కూరగాయలు అన్నీ రాళ్లలా మారాయి. సుత్తితో బలంగా కొడితే కానీ గుడ్లు పగలడం లేదు. జ్యూస్ తాగాలంటే గట్టకట్టిన దానిని ఓ పాత్రలో పెట్టి వేడి చేయాల్సి వస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *