అనంతపురంలో గొర్రెల కాపర్లు కావలెను జీతం రూ.2,50,000

అనంతపురంలో గొర్రెల కాపర్లు కావలెను జీతం రూ.2,50,000
కొన్నికొన్ని విషయాలు భలే అనిపిస్తాయి. వాటి వెనుక కారాణాలు తెలిసే వరకూ… ఆ వార్త వినగానే ఒకింత ఆశ్చర్యంగానూ, ఇంకొంత హాస్యాస్పదంగానూ అనిపిస్తాయి. ఇది సరిగ్గా అలాంటి సంఘటనే. గొర్రెల కాపరలకు అనంతపురంలో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తుల జీతాలకు ఏమాత్రమూ తీసిపోకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. జరగాల్సిన మర్యాదలకు ఏమత్రమూ తక్కువ ఉండదని మాటిస్తున్నారు. అయినా సరే… గొర్రెల యజమానులకు మాత్రం కాపరలు దొరకడం లేదు. 
 
Wanted Shepherd in AP

మార్మోగుతున్న దండోరా…

ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గొర్రెల కాపరుల కోసం దండోరా వినిపిస్తోంది. మూడుపూటలా భోజనాన్నీ, ప్రతి పండగకూ కొత్త బట్టల్నీ, ఏడాదికి రెండున్నర లక్షల రూపాయాల జీతాన్నీ ఆఫర్‌ చేస్తున్నారు. అయినా సరే ఏ ఒక్కరూ ఆసక్తి చూపడం లేదు. తీవ్ర వర్షాభావంతో, కరువు పరిస్థితులతో ఇబ్బంది పడుతుండే అనంతపురం కొన్నాళ్ల నుంచీ కోలుకుంటోంది. కృష్ణా జలాల తరలింపు కోలుకునేందుకు సాయపడుతోంది. అయినా సరే పేదకూలీల ఆకలి తీర్చేందుకు ఇవేవీ ఉపయోగపడటం లేదు. ఉపాధి కోసం ప్రాంతాలను దాటేవాళ్లు ఏటా పెరుగుతూనే ఉన్నారు. నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయని రాష్ర్టం దాటి కేరళ, బెంగుళూర్‌లకు వలసపోతున్నారు. తాజా లెక్కల ప్రకారం ఏటా నాలుగు లక్షల మంది అనంత నుంచి పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. గొర్రెల వ్యాపారం ఎక్కవగా జరిగే ప్రాంతాల్లో అనంతపురం ముందుంటుంది. కొంతకాలం కిందవరకూ కాపరులు కూడా బాగానే అందుబాటులో ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యజమానులు ఇచ్చే జీతాలు చాలక కాపరులంతా వేరేవేరే పనులు చూసుకున్నారు. దీంతో గొర్రెల ఓనర్లకు చచ్చేంత కష్టమొచ్చిపడింది. అందుకే ఎలా అయినా సరే కాపరులు కావాలని బంపర్ ఆఫర్లు ప్రకటించారు. వారి పబ్బం గడుస్తున్న కొద్దీ మళ్లీ తమ బతుకులు యథాస్థానానికి వస్తాయనీ, జీతాలు కోసిపడేస్తారనీ అనుకుంటున్న కాపరులు మాత్రం ఈ ప్రకటనపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తీవ్రమైన కరువున్న అనంతను కృష్టా జలాలు కొంతవరకూ కాపాడినా, రోజుకూలీల కడుపునింపు నిండే చర్యలు తీసుకోకపోడం మాత్రం విచారకరం. గతిలేకనే, కడుపునింపుకోవడం కోసమే ప్రయాణామవుతున్నామని వలసెళ్తున్న కూలీలు చెప్తున్నారు. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *