పదుల కిలోమీటర్లు వచ్చి ఓటు వేయాలి కానీ ...

పదుల కిలోమీటర్లు వచ్చి ఓటు వేయాలి కానీ ...

రాజకీయ నాయకులు ఎప్పుడూ చెప్పే మాట అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అని…కానీ అన్ని ప్రాంతాల్లో అలాగే ఉందా? పాలనలోని ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నారా? అన్ని సౌకర్యాలు సకాలంలో అందుతున్నాయా? వీటన్నిటికీ ‘ లేదు ‘ అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ముందైతే పాలకుల్ని ఎన్నుకునే అవకాశానికి సరైన సౌకర్యం అయినా కల్పించాలని కోరుతున్న ప్రజలు ఇంకా ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారు. వారికి ఉన్న ఇబ్బందులేంటి తెలుసుకుందాం….

20 కిలోమీటర్లు నడవాలి…

ఖమ్మం జిల్లాలోని పెనుగోలు గ్రామ ప్రజల పరిస్థితి ప్రభుత్వాల నుంచి సౌకర్యాలు అందవు కానీ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాయకులను ఎన్నుకునే అవకాశం కూడా లేకుండా ఉంది. దీనికి కారణం మండల కేంద్రానికి ఎక్కడో దూరంగా కొండల ప్రాంతంలో ఉండటమే వారికున్న ఇబ్బంది. ఈ పల్లే ప్రజలు ఓటు వేయాలంటే గుట్టలు, తుప్పలు దాటుకుంటూ దాదాపు 20 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాలి. వాహనాల రాకపోకలు అస్సలు లేని, కుదరని ప్రల్లే అది. కొండల పైనున్న ఆ పల్లెలో 46 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఆరుగురు వృద్ధులున్నారు. మండల కేంద్రానికి దగ్గరలోని ప్రాంతాల్లో వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులు, వృద్ధుల కొశం వాహనాలు ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా చూసే ఈసీ మాత్రం ఈ పల్లెకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పెనుగోలు గుట్టలమీద నుంచి 17 కిలోమీటర్లు నడిచి గుమ్మడిదొడ్డి వచ్చి, ఆకడినుంచి 3 కిలోమీటర్లు మళ్లీ ప్రయాణించి మండలంలోని జంగాలపల్లి పోలింగ్ కేంద్రానికి చేరాల్సిన పరిస్థితి ఉంది.

ప్రతి ఎన్నికల ముందు చెప్పడమొకటే…

ఇంత దూరం కాలినడకన వచ్చి ఓటు వేసినా వారికి ఒరిగేదేమీ ఉండదు. ఇన్నేళ్లలో ప్రతి ఎన్నికలకు ముందు ఇలా ఓటు వేయడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకోవడమే కానీ, ఏ నాయకుడు వారికి అవసరమైన కనీస అవసరాలను సమకూర్చలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *