రైళ్లు,బస్సుల్లో దొరకని రిజర్వేషన్లు

రైళ్లు,బస్సుల్లో దొరకని రిజర్వేషన్లు

ఎన్నికల వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు మరోసారి సంక్రాంతి వచ్చినట్లయింది.ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచి ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి.ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికలకు ఆంధ్రా వెళ్లాలనుకునే వారు వీలు చూసుకుని,సెలవు పెట్టుకుని ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకున్నారు.మరోవైపు గత రెండువారాల నుంచే ఇటు బస్సులు,అటు రైళ్లలో చాలామంది ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకుని ఇప్పటికే సొంతూళ్లకు పయనమయ్యారు.అయితే సెలవులు దొరక్క… వీలు దొరుకుతుందో తెలియక మరికొందరు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదిలాంటే..ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన నాటి నుంచి మెళ్లిమెళ్లిగా ఛార్జీలు పెంచాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌.దాదాపు 20 నుంచి 30 శాతం వరకు టికెట్‌ ఛార్జీలను పెంచిన ట్రావెల్స్‌ యాజమాన్యాలు..ఇప్పుడు ఏకంగా దాదాపు 50 శాతం మేర ఛార్జీలు పెంచేశాయి.మరీముఖ్యంగా ఏసీ,స్లీపర్‌ బస్సుల ఛార్జీలు రెట్టింపయ్యాయి.ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుకింగ్స్‌ అయిపోవడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు మరింత డిమాండ్‌ పెరిగింది.ఇదే అదునుగా ప్రయాణికులు నుంచి డబ్బును ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి.మరోవైపు ఆర్టీసీ అదనంగా బస్సులు ఏర్పాటు చేసినా వాటిలోనూ టికెట్లు ఫుల్‌ కావడంతో ఏం చేయాలో తెలియక ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు.

ఎన్నికల వేళ రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.ఇక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.రిజర్వేషన్లు దొరక్క పోవడంతో చాలామంది ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.ఛార్జీలు ఎక్కువైనా సరే వెళ్లామనుకునే వాళ్లకు టికెట్లు సీట్లు కరువయ్యాయి.ఇదిలా ఉంటే గురువారం రోజున పోలింగ్‌ కావడంతో శుక్రవారం సెలవు పెడితే శని,ఆదివారాలు కలిసొస్తాయని ఆంధ్రా ప్రాంతానికి చెందిన టెక్కీలు చాలామంది…ముందే టికెట్స్‌ బుక్‌ చేసుకున్నారు.మరికొందరు ట్రావెల్స్‌ ఛార్జీలకు బలవుతున్నారు.

మరోవైపు ఎన్నికల విధుల కోసం బస్సులు కేటాయించారు.ఇదికాస్త..ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు వరంగా మారింది.మరోవైపు ప్రధాన పార్టీలు ఆంధ్రా ఓటర్లను తీసుకెళ్లేందుకు ఫ్రీగా బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.పోనీ అందులో వెళ్తామనుకున్నా అందులోనూ రద్దీ ఎక్కువగా ఉండటంతో రిస్క్‌ తీసుకోవడం లేదు.మొత్తానికి ప్రయాణ భారం ఓటింగ్‌ శాతంపై ప్రభావం చూపే అవకాశాల లేకపోలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *