వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్...

వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్...

టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మధ్యనే ఐడియా సెల్యులార్‌తో కలిసిన వొడాఫోన్ 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని తెచ్చింది. ఎంపిక చేసిన ప్రీపైడ్ ప్లాన్స్‌కు ఇది వర్తిస్తుందని సంస్థ తెలిపింది. ప్లాన్స్ రూ. 399, రూ. 458, రూ. 509 లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ అధికారులు చెప్పారు. ఆసక్తికరంగా ఈ మూడు ప్లాన్‌లకు 4జీ స్పీడుతో రోజుకి 1.4GB వాడుకునే వెసులుబాటు ఇచ్చింది.

ఈ ఆఫర్‌ని పొందడానికి Myvodaafone app ద్వారా లాగిన్ అవ్వాలి. 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ రూ. 50 విలువైన వోచర్‌ల రూపంలో ఉంటుంది.

ప్లాన్స్ ఇలా ఉన్నాయి…

రూ. 399 ప్లాన్…ఈ ప్లాన్‌లో 100 శాతం క్యాష్‌బ్యాక్ కోసం ఎనిమిది రూ. 50 విలువైన ఓచర్‌లను Myvodafone app ద్వారా పొందుతారు. ఒకరోజులో 100 SMS ఉచితంగా వస్తాయి. ఈ ప్లాన్ 70 రోజుల వాలిడిటీ కలిగి ఉంటుంది.

రూ. 458 ప్లాన్…ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న యూజర్లు, 100 శాతం క్యాష్‌బ్యాక్ కోసం రూ. 50 విలువైన ఓచర్‌లను పొందుతారు. 84 రోజుల వాలిడిటీ ఉంటుంది.రూ. 458 ప్లాన్…ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న యూజర్లు, 100 శాతం క్యాష్‌బ్యాక్ కోసం రూ. 50 విలువైన ఓచర్‌లను పొందుతారు. 84 రోజుల వాలిడిటీ ఉంటుంది. రూ. 509 ప్లాన్…రోజుకి 1.4GB డాటా 4G స్పీడుతో ఉంటుంది. దీని వాలిడిటీ 90 రోజులు ఉంటుంది. 

మూడు ప్లాన్స్‌కి కామన్…

ఈ మూడు ప్లాన్స్‌కి ఒకే స్పీడ్ డాటా అమలవుతుంది. రోజుకి 1.4GB డాటా 4G స్పీడుతో ఉంటుంది. ఈ మూడు ప్లాన్స్‌లోనూ నేషనల్, రోమింగ్, లోకల్స్ కాల్స్ అన్‌లిమిటెడ్‌గా వాడుకోవచ్చు. ప్రతీ ప్లాన్‌కు రోజుకు 100 SMS లు ఉపయోగించుకోవచ్చు

అయితే, వీటిలో కొన్ని ఆఫర్లు కొన్ని ప్రాంతాల్లో వర్తించవని స్పష్టం చేశారు. రూ. 509 ప్లాన్ 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ చెన్నైలో వర్తించదని చెప్పారు. అలాగే, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రూ. 409 ప్లాన్ వర్తించదని తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *