పందెం కోడి2 సినిమా రివ్యూ

పందెం కోడి2 సినిమా రివ్యూ

పందెం కోడి… కెరీర్ స్టార్టింగ్ లోనే వచ్చిన ఈ సినిమా..  తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అవడంతో విశాల్ మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు… ఆ తర్వాత ఎన్నో హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన విశాల్… దాదాపు పదమూడేళ్ల తర్వాత పందెం కోడి సినిమాకి సీక్వెల్ చేస్తుండడంతో టాలీవుడ్ కోలీవుడ్ లో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి..  విశాల్ అండ్ కో ఎంత వరకు అందుకున్నారో చూద్దాం.

vishal new movie

రాజారెడ్డి, అతని కొడుకు బాలు.. ఒక వ్యక్తికి అండగా నిలుస్తారు. అయితే భవాని భర్త మర్డర్ విషయంలో involve అయి ఉండడంతో ఆ వ్యక్తికి భవాని నుంచి ప్రాణహాని ఉంటుంది.. కానీ రాజారెడ్డి మాట ఇవ్వడంతో.. బాలు ఆ వ్యక్తిని కాపాడుతూ వస్తుంటాడు.. దీంతో భవాని చూపు రాజారెడ్డి కుటుంబం పైన పడుతుంది. అక్కడి నుంచి బాలు.. భవానిని ఎలా ఫేస్ చేశాడు, తన కుటుంబానికి ఎదురయ్యే సమస్యలని ఎలా పరిష్కరించాడు అనేది పందెం కోడి 2 కథ..

సినిమాకి పిల్లర్…

మరోసారి బాలుగా కనిపించిన విశాల్.. సీన్స్ నుంచి ఫైట్స్ వరకు అన్నీ తానే అయి సినిమాని ముందుండి నడిపించాడు. పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్ మెప్పించింది. రాజారెడ్డిగా రాజ్ కిరణ్ పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. ఇక భావానిగా కనిపించిన వరలక్ష్మి నెగటివ్ రోల్ లో అద్భుతంగా నటించింది.. తన పాత్ర పందెం కోడి సినిమాకి మరో పిల్లర్ లా నిలిచింది.

Pandem kodi 2 movie review

కంబ్యాక్ మూవీ…

ఒక రెగ్యులర్ కమర్షియల్ కథకి మంచి కథనం తొండవడంతో పందెం కోడి 2 మాస్ ఆడియన్స్ కి ఆకట్టుకుంటుంది.. ఇంటర్వెల్ స్పీడ్ అందుకునే ఈ సినిమా ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది… ఇక దర్శకుడిగా లింగుస్వామికిది కంబ్యాక్ మూవీనే అయినా తన మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కొంత మేర నిరాశపరిచాడు… అందువలన అక్కడక్కడా కొంచెం ల్యాగ్ అనిపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పందెం కోడితో మొదటి సక్సస్ చుసిన విశాల్.. మరోసారి అదే పందెం కోడి సినిమాకి సీక్వెల్ చేసి దసరా పండగ కానుకగా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాడు…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *